Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
నోరూరించే కమ్మటి దొండకాయ పచ్చికారం..ఎలా చేయాలంటే
ఆరోగ్యానికి మేలు చేసే కాయగూరల్లో దొండకాయ ఒకటని మనందరికీ తెలిసిందే. దొండకాయతో ఫ్రై, పచ్చడి, పులుసు వంటి రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. సరిగ్గా వండాలేగానీ కూర, పచ్చడి, వేపుడు ఇలా దొండకాయతో ఏ రెసిపి చేసినా సరే టేస్ట్ అద్దిరిపోతుంది. దొండకాయతో ఎన్ని వెరైటీలు చేసినా.. దొండకాయ పచ్చికారం టేస్ట్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. వేడి వేడి అన్నంలో దీన్ని కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. నోరూరించే కమ్మటి దొండకాయ పచ్చికారం ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
దొండకాయ పచ్చికారం తయారీకి కావలసిన పదార్థాలు
దొండకాయలు - 250 గ్రాములు
పచ్చిమిర్చి - 15-20
చింతపండు - నిమ్మకాయ సైజు అంత
వెల్లుల్లి రెబ్బలు - 6-8
జీలకర్ర - 1 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
మెంతులు - 1/4 టీస్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - 1/4 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా

దొండకాయ పచ్చికారం తయారీ విధానం
-ముందుగా దొండకాయలు నీటిలో వేసి బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి అందులో పచ్చిమిర్చిని వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
-వేయించిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్‌లో దొండకాయ ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
-దొండకాయలు బాగా వేగాక వాటిని పచ్చిమిర్చితో పాటు ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
పచ్చికారం ఎగ్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? జిందగీలో ఇలాంటి టేస్ట్ చూసి ఉండరు,ఎలా చేయాలంటే
-ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు,కొద్దిగా ఇంగువ వేసి చిటపటలాడనివ్వాలి. పసుపు వేసి కలపాలి.
-ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే దొండకాయ పచ్చికారం రెడీ.
- మరింత రుచికరంగా చేయడానికి కొద్దిగా బెల్లం కావాలనుకుంటే వేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
