Latest Updates
-
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే!
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.!
ఇంట్లో ఏదైనా పూజ పెట్టుకున్నా, శుభకార్యాలైనా, వేడుకలైనా మొదటగా పసుపు గణపతిని లేదా గణేశుడి విగ్రహాన్ని పూజించడం సంప్రదాయం. పనిలో విఘ్నాలు కలగకుండా కాపాడే మొదటి దైవంగా భావిస్తారు. అలాంటి విఘ్నేశ్వరుడికి ప్రత్యేకంగా జరుపుకొనే పండుగ వినాయకచవితి. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా ఆరోజు గణనాథుడిని ప్రతిష్ఠించుకుని పూజలు నిర్వహిస్తాం. ఈ నెల 25న అనంత చతుర్దశి నాడు సంప్రదాయంగా నిమజ్జనం చేస్తాం. అయితే గణేశుడి పూజ వెనుక కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. గణనాథుడి వెనుకవైపు చూడకూడదని లేదంటే అశుభం జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకు కారణాలేంటంటే..

హిందూ మత సంప్రదాయం, విశ్వాసాల ప్రకారం వినాయకుడి విగ్రహం వెనుక భాగాన్ని చూడటం అశుభంగా భావిస్తారు. అలక్ష్మి అంటే దరిద్ర దేవత.. ఆయన వీపుపై నివసిస్తుందని చెబుతారు. అందుకే పూజ చేసే సమయంలో విగ్రహం వెనుక వైపు చూడకుండా ప్రయత్నించాలని పండితులు చెబుతుంటారు.

మరో కథ
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, సంతోషం, శ్రేయస్సు, జ్ఞానం, అదృష్టానికి అధిపతిగా గణనాథుడిని పూజిస్తారు. పై నమ్మకంతో పాటు మరో నమ్మకం ప్రచారంలో ఉంది. వినాయకుడి వీపుపై పేదరికం ఉంటుందని.. ఆ భాగాన్ని చూడటం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు, క్షీణిస్తుందని, ఆర్థిక నష్టం జరగవచ్చని ప్రచారంలో ఉంది. అయితే పూజ సమయంలో మీరు పొరపాటున చూసినట్లయితే ఆందోళన చెందకుండా గణాథుడిని స్మరించుకుని క్షమాపణలు కోరడం శ్రేయస్కరం. గణేశుని ముఖం వైపు చూస్తూ 'ఓం గం గణపత్యై నమః' అనే మంత్రాన్ని జపించడం ద్వారా అపశ్రుతి తొలగిపోతుంది. మంగళమూర్తిగా భావించే గణేశుడిని ఇలా స్మరించడం ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి.

విఘ్నేశ్వరుడి తొండం ఏవైపు ఉండాలి..
ఇదిలా ఉండగా.. లంబోదరుడిని పూజించడం కోసం ఇంట్లోకి తీసుకువచ్చే సమయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలు వినాయకుడి తొండం ఏ వైపు ఉండాలనే దానిపై సందిగ్ధత ఉంటుంది. సంప్రదాయం ప్రకారం. గణేశుడి తొండం ఎడమ వైపునకు తిరిగి ఉంటే చాలా మంచిదిగా శుభప్రదంగా భావిస్తారు. దీనిని వామ ముఖి అంటారు. గణేశుడి దృక్కోణం నుంచి చూస్తే తొండం ఆయన ఎడమవైపునకు తిరిగి ఉండాలి. మన దృక్కోణంలో చూస్తే మనకు కుడివైపుగా కనిపించాలి. ఇలా ఉన్న గణేశుడిని పూజించడానికి అనుకూలమైనదిగా చెబుతారు. ఇంట్లో సుఖశాంతులు, ఆనందం ఇస్తుంది. అదేవిధంగా వాస్తు దోషాలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.

ఇక గణేశుడి తొండం కుడి వైపునకు వంగి ఉంటే దక్షిణాభిముఖి లేదా సిద్ధి వినాయకుడిగా భావిస్తారు. ఈ రూపాన్ని అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు. ఈ రూపంలో గణేశుడిని ఇంట్లోకి తీసుకువస్తే కఠినమైన నియమాలు, నిష్ట, ప్రత్యేక పూజా విధానాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి విగ్రహాలను ఎక్కువగా ఇళ్లలో కంటే ఆలయాలలో ఎక్కువగా ప్రతిష్టిస్తారని సంప్రదాయం చెబుతోంది.



Click it and Unblock the Notifications
