వినాయక చవితి స్పెషల్‌: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి.!

మరో రెండు రోజుల్లో గణేశ్‌ చతుర్థి. స్వామివారికి ఇష్టమైన మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ల పాయసం ప్రతిసారీ చేసి నైవేద్యం సమర్పిస్తూనే ఉంటాం. వీటితో పాటు ఈ సారి కొత్తగా ప్రత్యేకంగా గణనాథుడికి ఇలా కారం ఉండ్రాళ్లు తయారు చేయండి. మీరు చేసిన నైవేద్యాలకే ప్రత్యేక లుక్‌ను తీసుకువస్తుంది ఈ స్పెషల్‌ కారం ఉండ్రాళ్లు. పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం..

Vinayaka chavithi special naivedhyam karam undrallu recipe with perfect measurements

వినాయక చవితి కారం ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు

తడి బియ్యం పిండి- రెండు కప్పులు
ఉప్పు- కొద్దిగా
నెయ్యి- అర టీస్పూన్‌
వేడి నీళ్లు- ఒకటిన్నర కప్పు
పొట్టు మినప్పప్పు- ఒకటిన్నర టీస్పూన్‌
పచ్చి శనగపప్పు- టీస్పూన్‌
నూనె- అర టేబుల్‌ స్పూన్‌
చల్ల మిరపకాయలు- మూడు
తాజా కొబ్బరి ముక్కలు- మూడు టేబుల్ స్పూన్లు
నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి- రెండు
ఆవాలు, జీలకర్ర- టీస్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు
అల్లం- చిన్న ముక్క
ఇంగువ- కొద్దిగా

వినాయక చవితి కారం ఉండ్రాళ్లు తయారీ విధానం

లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!

కారం ఉండ్రాళ్ల కోసం ముందుగా రెండు కప్పుల తడి బియ్యం పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేయాలి. అరటీస్పూన్‌ నెయ్యి వేసి వేడి నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని వేడయ్యాక పొట్టు మినప్పప్పు, పచ్చి శనగపప్పుతో పాటు నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత చల్ల మిరపకాయలు, తాజా కొబ్బరి ముక్కలు వేసి వేగిన తర్వాత చల్లారబెట్టి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి.

Vinayaka chavithi special naivedhyam karam undrallu recipe with perfect measurements

తడిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ కుక్కర్‌లో వేసి 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో స్టీమింగ్‌ చేసుకోవాలి. తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి.

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.!

ఈ లోపు స్టవ్‌పైన కడాయి పెట్టి వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత రెండు ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత కట్‌ చేసుకున్న అల్లం ముక్కలు, ఇంగువ వేసి కాసేపు రోస్ట్‌ చేసుకోవాలి.

పచ్చి వాసన పోయిన తర్వాత ఉడికించిన ఉండ్రాళ్లను వేసుకోవాలి. కలిపిన తర్వాత గ్రైండ్‌ చేసుకున్న పొడిని పేసుకుని చిన్న మంటపైన ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. చివర్లో తాజా కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోండి. లంబోదరుడికి ఇష్టమైన కారం ఉండ్రాళ్లు రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 12, 2026, 18:03 [IST]
Desktop Bottom Promotion