Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
అన్నం,చపాతీలోకి కిర్రాక్..జస్ట్ 10 నిమిషాల్లోనే దహీ మిర్చి ఫ్రై..ఎలా చేసుకోవాలంటే..
దహీ మిర్చి ఫ్రై అనేది పెరుగు, సుగంధ ద్రవ్యాలతో మిళితం చేసిన పచ్చి మిరపకాయలతో తయారుచేసే ఒక రుచికరమైన, కారంగా ఉండే వంటకం. ఇది సాధారణంగా అన్నం, చపాతీ, రోటీ లేదా పరాటాలతో సైడ్ డిష్ గా వడ్డిస్తారు. ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తయారుచేయడం చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా తమ రూముల్లో దీనిని జస్ట్ 10 నిమిషాల్లోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. సూపర్ టేప్టీ దహీ మిర్చి ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
దహీ మిర్చి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-జీడిపప్పు
-జీలకర్ర
-ఆవాలు
-పెరుగు
-సోంపు
-మిరియాలు
-ధనియాలు
-యాలకలు
-దాల్చిన చెక్క
-పచ్చి మిరపకాయలు
-ఆయిల్
-పసుపు
-కారం
-ఉప్పు
దహీ మిర్చి ఫ్రై తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 యాలకలు, అర ఇంచు దాల్చిన చెక్క వేసి మీడియం మంట మీద మాడకుండా వేయించుకోవాలి.
-వేగిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి చల్లారిన తర్వాత బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత పావు కేజీ లావాటి పచ్చిమిరపకాయలను శుభ్రంగా కడిగి పైన తొడిమలను తీసేసి గుడ్డతో తుడవాలి. తర్వాత వాటికి మధ్యలో నిలువుగా చీలికలు పెట్టాలి, కానీ అవి రెండుగా విరిగిపోకుండా జాగ్రత్తపడాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చెయ్యాలి. వేడెక్కిన ఆయిల్ లో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపలాడనిచ్చి 80శాతం వరకు చీరుకున్న పచ్చిమిరపకాయలను, 1రెమ్మకరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
-పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పొడి, అర టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ మిరపకాయలకు పట్టేలా తక్కువ మంట మీద 1 నిమిషం బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మరో 2 నిమిషాలు బాగా దగ్గరకు అయ్యేదాకా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది.
-మిరపకాయలు మెత్తగా అయ్యి, మిశ్రమం నూనె నుంచి విడివడటం ప్రారంభించినప్పుడు నిమ్మరసం వేసి కలపాలి. కొంచెం కొత్తిమీర తరుగు అందులో చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే సూపర్ టేస్టీ దహీ మిర్చి ఫ్రై రెడీ.
కొన్ని ప్రయోజనాలు
పచ్చి మిరపకాయలలో విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని
పెంచడానికి సహాయపడుతుంది. మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని
జీవక్రియను వేగవంతం చేసి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
మిరపకాయలు, ఇందులో వాడే కొన్ని మసాలాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా
ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల నష్టాన్ని
నివారించడంలో సహాయపడతాయి. ఈ వంటకంలో వాడే పెరుగు ప్రోటీన్‌కు మంచి
మూలం, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







