Desi Pasta: ఇండియన్ టచ్‌తో ఇటాలియన్ పాస్తా..నోరూరించే మసాలా మాక్రోని ఎలా చేసుకోవాలంటే

Posted By:

మసాలా మాక్రోని.. ఇది ఇటాలియన్ పాస్తాకు ఇండియన్ టచ్ ఇచ్చే ఫ్యూజన్ రెసిపి. దేశీ స్టైల్ లో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. కేవలం రుచిలోనే కాకుండా, మనం ఉపయోగించే పదార్థాలను బట్టి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మీకు నచ్చిన కూరగాయలను వాడొచ్చు. ఇది బ్రేక్ ఫాస్ట్, లంచ్, ప్రత్యామ్నాయంగా దేనికైనా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కి వెళ్లి వందల రూపాయలు ఖర్చు చేసి మసాలా మాక్రోని తినే కన్నా ఇంట్లోనే దీనిని రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో తయారుచేసుకోవచ్చు. మసాలా మాక్రోని తయారు చేయడం కూడా చాలా ఈజీనే. మసాలా మాక్రోని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మసాలా మాక్రోనీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-పాస్తా
-ధనియాల పొడి
-కారం
-టమాటో
క్యాప్సికమ్
-పచ్చి బఠాణీ
-గరం మసాలా
-కొత్తిమీర
-నీరు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-ఆయిల్
-జీలకర్ర పొడి
-మిరియాల పొడి
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర
-పచ్చిమిర్చి

Easy and Delicious Experience the Magic of Homemade Masala Macaroni Recipe in Telugu

మసాలా మాక్రోనీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో1 పెద్ద కప్పు నీళ్లు పోసి బాగా తెర్లకాగనివ్వాలి.

-నీళ్లు తెర్లకాగుతున్నప్పుడు అందులో 1 కప్పు యొల్లో పాస్తా వేసి ఉడికించాలి. పాస్తాను ఎంతసేపు ఉడికించాలి అనేది మీరు కొన్న ప్యాకెట్ పై రాసి ఉంటది.. దాని ప్రకారం ఉడికంచండి.

-తర్వాత స్టవ్ మీద నుంచి పాన్ దించేసి అందులో నుంచి పాస్తాను వడకట్టి ఓ ఫ్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీదపాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యండి.

-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 పచ్చిమిర్చి సన్నని తరుగు, అర టీస్పూన్ జీలకర్ర, 3 వెల్లుల్లి సన్నని తరుగు వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే 1 ఉల్లిపాయ తరుగు వేసిఫ్రై చేయండి.

వంకాయతో ఇంత రుచా? వంగీబాత్ టేస్ట్‌కి ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే

-ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడానే అందులో పావు కప్పు పచ్చి బఠానీ వేయాలి.1 నిమిషం తర్వాత ఇందులో 2 టమాటో సన్నని ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర పొడి, ముప్పావు టీస్పూన్ కారం, అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా, పావు టీస్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి టమాటోలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేయండి.

-టమాటో ముక్కలు సగం మెత్తబడ్డాక అందులో పావు కప్పు సన్నని క్యాప్సికమ్ తరుగు వేసి ఒక నిమిషం ఫ్రై చేయండి.

-ఆ తర్వాత అందులో అరకప్పు నీళ్లు పోసి కలిపి పెద్ద మంట మీద ఉడికించండి.

-ఎసరు బాగా ఉడుకుపడుతున్నప్పుడు అందులో ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పాస్తాను వేసి కలపాలి. నీరు ఇగిరిపోయి పాస్తా పీల్చుకునేదాకా ఉడికించాలి.

-చివరగా కొత్తిమీర తరుగు, కొద్దిగా నిమ్మరసం అందులో పిండి దించేయాలి. అంతే సూపర్ టేస్టీ మసాలా మాక్రోనీ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion