Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
గ్లాసులో ఇడ్లీ.. దూదిలా మెత్తగా వస్తాయ్..పిల్లలకు ఆకట్టుకునేలా..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
సాధారణంగా ఇడ్లీని ఇడ్లీ పాత్రలో ఉడికిస్తారు. కానీ, గ్లాసుల్లో ఇడ్లీ చేయడం అనేది ఒక వినూత్నమైన పద్ధతి. ఈ పద్ధతిలో ఇడ్లీలు గుండ్రంగా కాకుండా, గ్లాసుల ఆకారంలో పొడవుగా వస్తాయి. ఈ విధానం వల్ల ఇడ్లీలకు కొత్త రూపం వస్తుంది. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించడానికి లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలో వంటకం విభిన్నంగా కనిపించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు. ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు, ఇడ్లీ తయారీ విధానం సాంప్రదాయ పద్ధతి లాగే ఉంటాయి. గ్లాసుల్లో ఇడ్లీ చేయడం వల్ల ఎక్కువ మార్పులు ఉండవు, కేవలం ఉడికించే విధానం మాత్రమే మారుతుంది. గ్లాస్ ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
గ్లాస్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు - 1 గ్లాసు
-ఇడ్లీ రవ్వ - 2 1/2 గ్లాసులు
-మెంతులు - 1/2 టీస్పూను
-ఉప్పు - రుచికి సరిపడినంత
-నీరు - సరిపడినంత
-నూనె - గ్లాసులకు రాసుకోవడానికి సరిపడినంత
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, మెంతులను వేసి శుభ్రంగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టాలి. అదే సమయంలో మరొక గిన్నెలో ఇడ్లీ రవ్వను తీసుకొని, దానిని కూడా శుభ్రంగా కడిగి, నీరు పోసి నానబెట్టాలి.
-నానిన మినపప్పు, మెంతులను మిక్సీ లేదా గ్రైండర్ లో మెత్తని పిండిలా రుబ్బుకోవాలి. పిండి మెత్తగా, నురగలా ఉండేలా చూసుకోవాలి.
-నానిన ఇడ్లీ రవ్వను పిండిలో కలపడానికి ముందు, రవ్వలో ఉన్న నీటిని గట్టిగా పిసికి పూర్తిగా తీసివేయాలి. ఆ తర్వాత ఈ రవ్వను మినపప్పు పిండిలో వేసి చేత్తో బాగా కలపాలి.
-పిండిని ఒక పెద్ద గిన్నెలో తీసుకుని, మూత పెట్టి వెచ్చని ప్రదేశంలో 6-8 గంటల పాటు పులియబెట్టాలి. పిండి బాగా పులిసి,పొంగి రెట్టింపు అవుతుంది. పిండి పులిసిన తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి, నిదానంగా కలపాలి.
-ఇప్పుడు ఇడ్లీ తయారుచేయడానికి గ్లాసులను తీసుకోవాలి. సాధారణంగా స్టీల్ లేదా అల్యూమినియం గ్లాసులు దీనికి అనుకూలంగా ఉంటాయి. గాజు గ్లాసులను వాడితే,అవి వేడికి పగిలిపోయే అవకాశం ఉంది.
-గ్లాసుల లోపలి భాగంలో నూనె లేదా నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. సిద్ధం చేసుకున్న గ్లాసుల్లో పులిసిన ఇడ్లీ పిండిని నింపాలి. గ్లాసులో సగం లేదా ముప్పావు భాగం మాత్రమే పిండి వేయాలి, ఎందుకంటే ఉడికేటప్పుడు పిండి పొంగుతుంది.
-స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. నీరు మరిగిన తర్వా, పిండితో నింపిన గ్లాసులను గిన్నెలో నిటారుగా నిలబెట్టాలి. మూత పెట్టి 10-15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-ఇడ్లీలు ఉడికిన తర్వాత, గ్యాస్ ఆఫ్ చేసి, గ్లాసులను బయటకు తీసి, కొద్దిగా చల్లబరచాలి. ఆ తర్వాత ఒక చాకుతో గ్లాసు అంచులను అటు ఇటు కదుపుతూ, ఇడ్లీని సులభంగా బయటకు తీయవచ్చు.
-గ్లాసుల నుండి బయటకు వచ్చిన ఇడ్లీలను గుండ్రటి చక్రాలుగా కట్ చేసి, చట్నీ లేదా సాంబార్ తో వేడి వేడిగా వడ్డించుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








