Latest Updates
-
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఒక్కోసారి ఇంట్లో కూరలు ఏం ఉండవు. కొన్ని కూరలు తినాలంటే బోర్ కొట్టేస్తాయి. మరోసారి కూరగాయలు లేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఏం వండుకోవాలో తోచదు. కానీ ఆకలికి సమాధానం చెప్పాలంటే కడుపు సంతృప్తిగా నిండాల్సిందే. అప్పుడు ఇంట్లో బజ్జీలు చేసే మిర్చీలు, శనగపిండి ఉంటే చాలు ఒకటికి రెండు ముద్దలు ఎక్కువ తినడమే కాదు.. టేస్టీగా తినాలనిపించినప్పుడల్లా ఇదే చేసుకుంటారు. ఈ ఒక్క రెసిపీతో బజ్జీలు తిన్నామనే తృప్తితో పాటు కూర తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ మిర్చి ఫ్రై రెసిపీని ఎలా చేయాలో చూద్దాం..

మిర్చి ఫ్రై రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బజ్జీలకు ఉపయోగించే మిర్చి- 350 గ్రాములు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
శనగపిండి- రెండు కప్పులు
జీలకర్ర- టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
కచ్చాపచ్చాగ దంచిన వెల్లుల్లి- అర కప్పు
ఉల్లిపాయ- ఒకటి
కొత్తిమీర- గుప్పెడు
పుదీనా- గుప్పెడు
పసుపు- అర టీస్పూన్
కారం- రెండు టీస్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా- అర టీస్పూన్
మిర్చి ఫ్రై రెసిపీ తయారీ విధానం
ముందుగా బజ్జీ మిర్చిలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యలో ఒకవైపుగా మాత్రమే చీల్చి అందులో ఉన్న గింజలను తొలగించాలి. ఇలాగే అన్నిటినీ చేసి పక్కన పెట్టుకోవాలి.
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టి టీస్పూన్ నూనె వేసి వేడయ్యాక శనగపిండి వేసి దోరగా వేయించాలి. పచ్చివాసన పోయే వరకు చిన్నమంటపైన కలుపుతూ వేగనివ్వాలి. తర్వాత ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి.

అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగాక వెల్లుల్లి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు ఉడికించాలి.
మసాలాలు బాగా కలిసిన తర్వాత ఈ మొత్తాన్ని శనగపిండిలో కలుపుకోవాలి. గరిటెతో మొత్తం కలిపాక కొద్దిగా నూనె వేసి ముద్దలా చేసుకోవాలి.
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
ఈ పిండిని కొంచెంకొంచెంగా ఒత్తుకుని తీసుకుంటూ గాటుపెట్టిన మిర్చిలో తురుముకోవాలి. అన్నిటికీ అలాగే అప్లై చేసుకోవాలి.
స్టవ్‌పైన పాన్ పెట్టుకుని మిగిలిన నూనె వేసి వేడయ్యాక మిర్చి స్టఫ్‌లు వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకోవడమే. చాలా ఈజీ, టేస్టీగా మిర్చి ఫ్రై రెసిపీ రెడీ.
వేడివేడిగా అన్నంలోకి ఇది ఒక్కటి సరిపోతుంది. ఉల్లిపాయ సలాడ్, నిమ్మకాయ ముక్కలతో తింటే ఆ టేస్ట్‌కి చికెన్‌ను కూడా మరిచిపోతారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
