రెగ్యులర్‌ కుర్మాకి గుడ్‌ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'!

పూరీలోకి కాంబినేషన్‌ అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఆలూ కుర్మా, ఉల్లిపాయ కుర్మా లేదా పప్పు ఇవే గుర్తొస్తాయి. కానీ ఎప్పుడూ అదే కాంబినేషన్‌ తింటుంటే బోర్‌ కొడుతుంది కదా.. ఈ సారి కొత్తగా, హెల్తీగా, రుచికరంగా తీపి గుమ్మడికాయ కుర్మాను ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉండటమే కాదు. మళ్లీ మళ్లీ కావాలంటారు. లొట్టలేసుకుంటూ తింటారు. తీపి గుమ్మడికాయ కుర్మాను సింపుల్‌గా, టేస్టీగా ఎలా తయారుచేయాలో చూద్దాం..

ever green combination in breakfast for pooris sweet pumpkin kurma recipe

తీపి గుమ్మడికాయ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చిమిర్చి- మూడు
పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు
మిరియాలు- పావు టీస్పూన్‌
జీలకర్ర- పావు టీస్పూన్‌
మసాలా దినుసులు
జీడిపప్పు పలుకులు- రెండు టేబుల్‌ స్పూన్లు
నూనె- ఐదు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిగడ్డ- రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
తీపి గుమ్మడి కాయ ముక్కలు- ఒకటిన్నర కప్పు
కప్పు- క్యారెట్‌ ముక్కలు
టమాటా- ఒకటి
పుదీనా తరుగు- గుప్పెడు
కాచి చల్లార్చిన పాలు- అర కప్పు

తీపి గుమ్మడికాయ కుర్మా తయారీ విధానం

నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.!

ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, మిరియాలు, జీలకర్ర, రెండు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసి అవసరమైతే కొన్ని నీళ్లు పోసి రుబ్బుకోవాలి.

పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్‌ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా..

గుమ్మడికాయ, క్యారెట్‌, టమాటా, ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకోవాలి.

స్టవ్‌పైన కుక్కర్‌ పెట్టుకుని నూనె వేసి కాగిన తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, కొన్ని మసాలా దినుసులు వేసి వేయించాలి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

ever green combination in breakfast for pooris sweet pumpkin kurma recipe

తర్వాత గ్రైండ్‌ చేసి పెట్టుకున్న పేస్ట్‌ వేసి కలిపి పావు కప్పు వేడి నీళ్లు పోసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి.

మిశ్రమం చిక్కబడుతున్నప్పుడు గుమ్మడికాయ, క్యారెట్‌, టమాటా ముక్కలు, పుదీనా తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు పోసి కుక్కర్‌ మూత పెట్టి రెండు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి.

ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి మరి కాసేపు ఉడికించి దించుకోవడమే. పూరీల్లోకి కొత్తగా గుమ్మడికాయ కుర్మా రెడీ. పూరీల్లోకే కాదు చపాతీ, బగారా, వెజ్‌ బిర్యానీలోకి సైతం అమోఘంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, October 6, 2026, 5:00 [IST]
Desktop Bottom Promotion