Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోయే టమాటా మినపపప్పు చట్నీ.. ఒక్కసారి రుచి చూశారంటే వదిలిపెట్టరు! -
భారతదేశంలో నిప్పులు చెరుగుతున్న ఏకైక అగ్నిపర్వతం ఎక్కడుందో తెలుసా? -
క్రీమీ, చీజీ కాలీఫ్లవర్ పాస్తా.. ఒకే పాత్రలో సులభంగా చేసుకోండిలా.. -
దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే పెళ్లిళ్ల స్టైల్ మైసూర్ పాక్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
రుచిగా, పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్..తింటే కొండలను ఢీకొట్టే శక్తి! -
ఈ ఒక్క ఎక్సర్ సైజ్ చేస్తే 100 ఏళ్లు బ్రతకొచ్చు..న్యూరాలజిస్ట్ చెప్పిన సంచలన నిజం! -
అట్లతద్ది స్పెషల్..ఈ టిప్స్ పాటిస్తే దూదిలా మెత్తటి వాయనం అట్లు.. -
Happy Atla Tadde 2026: బంధుమిత్రులకు, పెళ్లి కాని అమ్మాయిలకు అట్లతద్ది విషెస్, స్టేటస్ లు -
పొట్ట కొవ్వును కొవ్వొత్తిలా కరిగించే డ్రింక్స్ ఇవే! -
పక్క రాష్ట్రంలో భర్త జాబ్..మరిది ప్రైవేట్ పార్ట్ కొరికిన వదిన..55 కుట్లు పడ్డాయ్
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వీధివీధినా వెలిసే పందిళ్లు, భక్తిశ్రద్ధలతో చేసే పూజలు, నోరూరించే రకరకాల పిండివంటలు. గణనాథుడికి తీపి పదార్థాలు అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మోదకాలు, ఉండ్రాళ్లతో పాటు కమ్మని సువాసనలు వెదజల్లే శనగపిండి లడ్డూలను కూడా స్వామివారికి ఇష్టమైన నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
మార్కెట్లో కొనేవాటికంటే, మన స్వచేతులతో ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో ప్రసాదం తయారు చేసి ఆ విఘ్నేశ్వరుడికి సమర్పిస్తే ఆ సంతృప్తే వేరు. ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా మీ ఇంట్లో అత్యంత సులభంగా, రుచికరంగా శనగపిండి లడ్డూలను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
శనగపిండి - 2 కప్పులు
కమ్మని దేశీ నెయ్యి - 1 కప్పు
పంచదార పొడి - 1 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
బాదం పప్పులు - 8 నుండి 10
జీడిపప్పులు - 8 నుండి 10
పిస్తా పప్పులు - 1 టేబుల్ స్పూన్
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి అడుగు ఉన్న ఒక కడాయిని పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి కరిగించండి. నెయ్యి కొద్దిగా వేడెక్కగానే, శనగపిండిని వేసి మంటను పూర్తిగా సిమ్ లో పెట్టండి.
-ఈ లడ్డూల తయారీలో అత్యంత కీలకమైన ఘట్టం శనగపిండిని దోరగా వేయించడమే. గరిటెతో పిండిని ఆపకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు ఓర్పుగా వేయిస్తే, శనగపిండి లేత బంగారు రంగులోకి మారుతుంది.
-అప్పుడు తరిగిన బాదం, జీడిపప్పు ముక్కలను అందులో వేసి మరో 2-3 నిమిషాల పాటు వేయించండి. డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేగి లడ్డూలకు మరింత రుచిని ఇస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వండి.
-మిశ్రమం మరీ చల్లారిపోకూడదు. గోరువెచ్చగా ఉన్న సమయంలో, ముందుగా సిద్ధం చేసుకున్న పంచదార పొడి, యాలకుల పొడిని వేసి చేత్తో బాగా కలపండి. వేడిగా ఉన్నప్పుడు పంచదార కలిపితే కరిగిపోయి లడ్డూలు రావు, కాబట్టి గోరువెచ్చదనం ఉన్నప్పుడే కలపడం ముఖ్యం.
-ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని మీకు నచ్చిన పరిమాణంలో గుండ్రని లడ్డూలుగా చుట్టుకోండి. చివరగా వాటిపై పిస్తా పప్పులతో అలంకరిస్తే, కంటికి ఇంపుగా ఉండే ప్రసాదం రెడీ.
-ఈ శనగపిండి లడ్డూలు దేవుడికి ప్రీతిపాత్రమైనవే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. శనగపిండిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తక్షణ శక్తిని ఇస్తే, స్వచ్ఛమైన నెయ్యి లడ్డూలకు రుచిని ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
