Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.!
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
వినాయక చవితి సందర్భంగా గణనాథుడి పూజలో నైవేద్యాలకు ప్రత్యేకత ఉంది. ఏ పండుగలకీ చేయని విధంగా ఈ పండుగకి గణేశుడికి ప్రీతికరమైన రకరకాల ప్రసాదాలను తయారుచేస్తాం. ఆవిరి బెల్లం కుడుములు, ఉండ్రాళ్ల పాయసం, రవ్వ కేసరి ఇలా రకరకాల నైవేద్యాలు సమర్పిస్తాం. వీటితో పాటు కారంగా ఉండే ప్రసాదాలు కూడా సమర్పించడం సంప్రదాయం. ఇక గణపతికి కారం ప్రసాదాలు అంటే ముందుగా శనగల ప్రసాదం గుర్తొస్తుంది. రెగ్యులర్ శనగలతో కాకుండా ఇలా గణపయ్యకి కాబూలీ శనగలతో ప్రసాదం చేయండి. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.

శనగల ప్రసాదం తయారీకి కావాల్సిన పదార్థాలు
కాబూలీ శనగలు- అర కప్పు
నూనె- టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు- టీస్పూన్
మినప్పప్పు- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఇంగువ- కొద్దిగా
పచ్చిమిర్చి- మూడు
ఎండు మిర్చి- మూడు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- అర టీస్పూన్
క్యారెట్ తురుము- టేబుల్ స్పూన్
పచ్చి కొబ్బరి తురుము- టేబుల్ స్పూన్
కొత్తిమీర- కొద్దిగా
శనగల ప్రసాదం తయారీ విధానం
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
శనగల ప్రసాదం కోసం ముందుగా కాబూలీ శనగలను కడిగి మూడు గంటలపాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
శనగలు ఉడికిన తర్వాత నీళ్లను తీసేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి.
పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అరటీస్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత ఉడికించిన కాబూలీ శనగలను వేసి నూనెలో మగ్గించుకోవాలి.
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
శనగలు వేగిన తర్వాత క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడిగా, కారంగా గణపతి భగవానుడికి కాబూలీ శనగల ప్రసాదం రెడీ.
ఉండ్రాళ్లు, కుడుములు, పాయసంతో పాటు కాసింత స్పైసీగా వీటిని కూడా చేయండి. స్వీట్‌తో హాట్ ప్రసాదాలు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
కాబూలీ శనగల ప్రసాదంతో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు దోహదపడుతుంది. త్వరగా కడుపు నిండేలా చూసి బరువును అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ బాధితులకు మంచి స్నాక్స్‌లా తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. రక్తహీనత సమస్యను నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
