Latest Updates
-
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.!
ఒకప్పుడు మన పూర్వీకులు గంజి తాగే చాలా బలంగా ఉండేవారు. అన్నం వండేటప్పుడు వార్చగా వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుని తిని రోజంతా ఉత్సాహంగా పనిచేసేవారు. అంతగా ఆ గంజిలో ఏముంది అనుకుంటున్నారా. కండరాల బలానికి దోహదపడే విటమిన్ బి12 ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కానీ ఇప్పటి కాలంలో ఇలా గంజి వార్చడం, తాగడం తగ్గిపోయింది. ఒకవేళ గంజివార్చినా పారబోస్తున్నారు. ఈసారి ఇలాంటి పొరపాటు చేయకుండా ఇలా కమ్మగా చారు చేసుకోండి. గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు.

గంజి చారు తయారీకి కావాల్సిన పదార్థాలు
గంజి- రెండు గ్లాసులు
చింతపండు- నిమ్మకాయ సైజు
వెల్లుల్లి రెబ్బలు- పది
ఉల్లిగడ్డలు- రెండు చిన్న సైజు
సొరకాయ ముక్కలు- కప్పు
క్యారెట్ ముక్కలు- కప్పు
పచ్చిమిర్చి- ఆరు
ముల్లంగి- అర కప్పు
నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీలకర్ర- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
మిరియాలు- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
కరివేపాకు- రెండు రెబ్బలు
నీళ్లు- ఒక గ్లాసు
ఉప్పు- రుచికి సరిపడా
గంజి చారు తయారీ విధానం
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
ముందుగా మరీ పలుచగా, మరీ చిక్కగా లేని గంజిని రెండు గ్లాసులు తీసుకోవాలి. చింతపండును కడిగి నానబెట్టుకుని గుజ్జు మాదిరిగా చేసుకోవాలి. మిరియాలు, కాస్త జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు రోట్లో వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి, మందపాటి బాణలి పెట్టుకుని నూనె పోసుకుని కాగనివ్వాలి. జీలకర్ర, మెంతులు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి కలపాలి. తర్వాత కట్ చేసిన ఉల్లిగడ్డ, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి వేసి మెత్తగా ఉడకనివ్వాలి.

తాలింపులో ఈ ముక్కలన్నీ ఉడికిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి కలపాలి. తర్వాత గంజి నీళ్లు, చింతపండు రసం వేసి మొత్తం కలియతిప్పాలి. ఇప్పుడు నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకోవాలి.
చారు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా రాతి ఉప్పు వేసుకుని కలిపి చిన్న మంటపైన మరికాసేపు మరిగించుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, మిరియాలు వేస్తున్నాం కాబట్టి కారం అవసరం లేదు.
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.!
గంజి చారు కమ్మని వాసన వస్తూ మీకు కావాల్సిన విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రుచికరమైన గంజి చారు రెడీ.
ఈ చారును ఉదయాన్నే ఇడ్లీ లేదా దోశలోకి తీసుకోవచ్చు. లేదా మధ్యాహ్నం వేడిగా అన్నంలోకి తీసుకోవచ్చు. గ్లాసులో పోసుకుని తాగేంత కమ్మగా ఉంటుంది. చిన్నపిల్లలకు సైతం ఈ గంజి చారం తాపడం ద్వారా బలంగా ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
