Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
రెస్టారెంట్ స్టైల్ దొండకాయ ఫ్రై..ఆ ఒక్క పొడితో సూపర్ హిట్
మనందరి ఇళ్లలో దొండకాయ వేపుడు సర్వసాధారణం. కానీ రెస్టారెంట్ లేదా హోటల్ కు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే దొండకాయ వేపుడుకి ఒక ప్రత్యేకమైన రుచి, కరకరలాడే గుణం ఉంటాయి. ఇంటిలో ఎంత ప్రయత్నించినా ఆ రుచి రావడం లేదని చాలా మంది అనుకుంటారు.
సాధారణ వేపుడుకు, హోటల్ స్టైల్ వేపుడుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలుంటాయి. హోటల్స్ లో ముక్కలు మెత్తబడకుండా, చాలా క్రిస్పీగా ఉంటాయి. దీనికి కారణం వారు వాడే వంట పద్ధతి, నూనె పరిమాణం, సరైన సమయంలో ఉప్పు వేయడం. వేపుడు మీద చివరగా చల్లే ఒక ప్రత్యేకమైన పొడి దాని రుచిని రెట్టింపు చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు
దొండకాయలు:అర కేజీ
నూనె: 4-5 టేబుల్ స్పూన్లు
ఆవాలు: 1 టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: 2-3
కరివేపాకు: రెండు రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు: 5-6
పసుపు: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
ఎండు కొబ్బరి తురుము: 3 టేబుల్ స్పూన్లు
వేరుశనగ పప్పు: 2 టేబుల్ స్పూన్లు
వేయించిన శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
కారం: 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 4-5
ఉప్పు: చిటికెడు
తయారీ విధానం
-దొండకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడవండి.
-ఇప్పుడు దొండకాయలను సన్నగా, గుండ్రంగా లేదా పొడవుగా ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అందులో వేయించిన వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి తురుము, కారం, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఉప్పు వేసి కొంచెం బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి,మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టి నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. ఎండు మిరపకాయలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు కోసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను బాండీలో వేయండి. బాగా కలిపి, ముక్కలన్నింటికీ నూనె పట్టేలా చూడండి. మంటను మీడియంలో ఉంచి, మూత పెట్టకుండా వేయించండి.
-ప్రతి 3-4 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. దొండకాయలలోని తేమ పూర్తిగా పోయి, ముక్కలు కొద్దిగా రంగు మారి, కరకరలాడే వరకు వేయించాలి. ఈ ప్రక్రియకు సుమారు 15-20 నిమిషాలు పట్టవచ్చు.
-ముక్కలు 80శాతం వేగిన తర్వాత, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. ముందే ఉప్పు వేస్తే దొండకాయల నుండి నీరు బయటకు వచ్చి వేపుడు మెత్తగా అవుతుంది. ఇది హోటల్ స్టైల్ వేపుడుకు ముఖ్యమైన చిట్కా.
-ఉప్పు వేసిన తర్వాత మరో 5 నిమిషాలు వేయించి, ముక్కలు పూర్తిగా క్రిస్పీగా మారినట్లు గుర్తించాక స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి ముందుగా సిద్ధం చేసుకున్న వేపుడు కారం పొడిని వేయండి.
-పొడి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా ఒకటి లేదా రెండు నిమిషాలు కలపండి. పొడి మాడిపోకుండా జాగ్రత్త వహించండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే వేడి వేడి హోటల్ స్టైల్ దొండకాయ వేపుడు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
