Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పరిగడుపున ఒక చెంచా నెయ్యిని వారంపాటు తింటే ఏమవుతుందో తెలుసా..?
పరిగడుపున నెయ్యితింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. నెయ్యికి ఆయుర్వేద్ధంలో చాలా ప్రముఖమైన స్థానం వుంది. బర్రె నెయ్యి కన్నా ఆవు నెయ్యినే ఎక్కువగా తీసుకోమని పెద్దలతో పాటు నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఆవు నెయ్యిని పప్పు చారులో కలుపుకొని అన్నం తింటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. ఏ స్వీటు చేసినా నెయ్యి లేకపోతే రుచి రాదు. ఇంట్లో తప్పకుండా ఆవు నెయ్యి వుండేలా చూసుకోవాలి. ఆరోగ్యాకరమైన శరీరానికి మంచి చేసే కొవ్వు ఈ ఆవు నెయ్యిలో ఉంటుంది.

ఒక స్పూన్ నెయ్యిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
1. ఉదయాన్నే ఒక చెంచా నెయ్యిని తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. జీర్ణం కావడానికి అవసరమైన రసాయణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది తిన్న ఆహారాం పూర్తిగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
2. నెయ్యి లో ఫ్యాటీ ఆసిడ్లు పుష్కళంగా ఉంటాయ్. ఈ ఫ్యాటీ ఆసిడ్లు కడుపులో సులభంగా జీర్ణమవుతాయ్. రోజు ఉదయం నెయ్యిని తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది. దీని వల్ల మీరు ఆరోజంతా యాక్టీవ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.
3. నెయ్యి ని తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరగకుండా వుంటారు. ఇందులో ఆరోగ్యాకరమైన కొవ్వులు ఉండడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. తరువాత ఆకాలి ఎక్కువ కాకుండా చేస్తుంది. దీని వల్ల అనవసరమైన ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా వుంటారు.
4. నెయ్యిలో వుండే కొవ్వు మెదడుకు చాలా మంచిది. బ్రెయిన్ సెల్స్ మెరుగు కావడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో మానసిక వత్తిడిని కూడా దూరం చేస్తుంది. ఆ రోజు మీరు అన్ని పనుల్లో చురుకుగా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది.

5. నెయ్యిలో వుండే బుట్రిక్ ఆసిడ్ శరీరంలో రోగానిరోధక శక్తిని పెంచుతుంది. నిద్రలేవగానే నీళ్లు తాగి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఒక చెంచా నెయ్యిని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చాలా రకాల ఇన్ఫెక్షన్ల బారిన రోగాల బారిన పడకుండా వుంటారు.
6. శరీరంలో ఏవైనా విష పాదార్ధాలు బ్యాక్టీరియా వున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయ్. ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కళంగా ఉండడం వల్ల కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు కూడా ఎదుర్కొనే శక్తి వుంటుంది.
7. శరీరంలో హార్మోన్లు సంమృద్ధిగా పెరగాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు వుండాల్సిందేే. ఈ నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు వుంటుంది దీంతో హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయ్. నెయ్యిలో వైటమిన్ డి, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ కె వుండడం వల్ల చర్మం ఆరోగ్యంగా వుంటుంది. రోజును నెయ్యితో ప్రారంభిస్తే మీ శరీరం ప్రతి రోజూ నిగనిగలాడుతుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
8. ప్రతి రోజు శరీరానికి కొన్ని పోషకాలు, మినరల్స్ అవసరమౌతాయ్. రోజూ పరిగడుపున ఒక చెంచా నెయ్యిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలు పుష్కలంగా అందుతాయ్. మలబద్దకం సమస్యను కూడా నెయ్యి నివారిస్తుంది.
9. నెయ్యిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుండడం వల్ల మోకాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ రాకుండా వుంటాయ్. ప్రతీ రోజూ తప్పనిసరిగా ఒక టీస్పూన్ నెయ్యిని పరిగడుపున అలాగే తినండం లేదంటే నీళ్లల్లో కలుపుకొని తినండి. ఇలా 15 రోజులు చేసిన తరువాత ఫలితాన్ని మీరే స్వయంగా చూస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
