Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Godavari special fish curry: తిన్న కొద్దీ తినాలనిపించే గోదావరి విలేజ్ స్టైల్ 'చేపల పులుసు'..ఇలా చేసుకోవాలి
చేపల పులుసు అంటే కొంతమందికి పోయే ప్రాణం కూడా లేచి వస్తది. చేపల పులుసు తినాలని తహతహలాడిపోతుంటారు కొందరు. అయితే చేపల పులుసు ఒక్కో ఏరియాలో ఒక్కో స్టైల్ లో చేస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాలుగా చేపల పులుసుని వండుతారు. అయితే గోదావరి జిల్లాల్లో పల్లెటూర్లలో వండే చేపల పులుసు టేస్ట్ మిగతా వేటికి రాదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. తినే కొద్దీ తినాలనిస్తుంటది..ముక్క ముక్కలో మజా వస్తుంది. గోదావరి విలేజ్ స్టైల్ లో చేపల పులుసు మీ ఇంట్లో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక్కడ చూడండి.
గోదావరి విలేజ్ స్టైల్ లో చేపల పులుసు తయారీకి కావాల్సిన
పదార్థాలు
-బొచ్చె చేపలు
-ఉప్పు
-కారం
-పసుపు
-ఉల్లిపాయ
-టమాటో
-చింతపండు
-ఆయిల్
-మెంతులు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ధనియాలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-లవంగాలు
-మిరియాలు
-ధనియాలు
-దాల్చిన చెక్క

తయారీ విధానం
-ముందుగా 1 కేజీ బొచ్చె చేపలను ముక్కలుగా కట్ చేసి ఓ గిన్నెలో వేసి అందులో 1 టీస్పూన్ ఉప్పు, 1 టీస్పూన్ కారం, 1 టీస్పూన్ పసుపు వేసి అన్నీ ముక్కలకు కలిసేలా కలిపి మూతపెట్టేసి 30 నిమిషాల పాటు ఆ గిన్నె పక్కనపెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో మీడియం సైజ్ లో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు,2 స్పూన్ల ధనియాలు వేసి గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు టమాటో సైజు అంత చింతపండుని 15 నిమిషాలు నీళ్లల్లో నానబెట్టండి.
-తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీస్పూన్ మెంతులు, మిక్సీలో వేసి చేసిన మిశ్రమాన్ని వేసి మీడియం ప్లేమ్ మీద 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకోండి.
-తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉంచండి.
-తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఉండండి. అడుగు అంటడం స్టార్ట్ అయ్యాక ఇందులో అర టీ స్పూన్ పసుపు,రుచికి సరిపడా ఉప్పు,2 టీస్పూన్ల కారం వేసి మంటను లో ప్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండండి.
-తర్వాత మిక్సీలో 3 టమాటోలు వేసి గుజ్జుగా చేసి అది ఈ పాన్ లో వేసి కలిపి మూతపెట్టేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 10 పచ్చిమిర్చి,చేప ముక్కలు వేసి మూతపెట్టేయండి.
-3 నిమిషాల తర్వాత మూత తీసి అందులో నానబెట్టిన చింతపండు రసం,1 లీటర్ నీళ్లు పోసేసి మూతపెట్టేయండి. మంటను హై ప్లేమ్ లో పెట్టి అరగంట పాటు పాటు ఉడకనివ్వండి.
-ఈ సమయంలో మిక్సీలో లేదా రోట్లో 4 యాలకులు, 1 టీస్పూన్ మిరియాలు,5 లవంగాలు,1 ఇంచు చెక్కమిక్సీలో వేసి మెత్తగా దంచి ఆ పొడిని చేపలలో వేసి గరిట పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని ఆ గిన్నెను అటు ఇటూ కదిలించి మూత పెట్టేయండి.
-కొద్దిసేపటి తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చేపల పులుసు రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో అయినా లేదా చద్దన్నంలో అయినా కలుపుకొని తింటే మాటల్లో చెప్పలేని మజా వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
