Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
నోరూరించే గోంగూర బోటీ.. ఇలా వండితే రుచి అదుర్స్!
గోంగూరతో చేసే వంటకాల రుచి అద్భుతం. గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర రొయ్యలు ఎంత ఫేమస్సో..గోంగూర బోటీ కూడా అంతే ఫేమస్. బోటీ (మేక లేదా గొర్రె పేగులులేదా పొట్ట భాగం),పుల్లటి గోంగూర కలయికలో వచ్చే ఆ రుచి, సువాసన ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది.
జొన్న రొట్టె, రాగి ముద్ద లేదా వేడి వేడి అన్నంలో ఈ గోంగూర బోటీ కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. గోంగూర బోటీ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో గోంగూర,బోటీ రెండింటి ప్రయోజనాలు కలిపి మనకు అందుతాయి. అదిరిపోయే టేస్ట్ తో గోంగూర బోటీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

గోంగూర బోటీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోటీ (మేక లేదా గొర్రె)
-పసుపు
-ఉప్పు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-నీళ్లు
-గోంగూర కట్టలు
-పచ్చిమిర్చి
-నూనె
-ఉల్లిపాయ
-కారం
-గరం మసాలా
-కొత్తిమీర
గోంగూర బోటీ తయారీ విధానం
-బోటీ కూర రుచిగా ఉండాలంటే దాన్ని శుభ్రం చేసే విధానం చాలా ముఖ్యం. సరిగ్గా క్లీన్ చేయకపోతే కూర నీచు వాసన వస్తుంది. ముందుగా బోటీని సాధారణ నీటితో ఒకసారి కడగాలి. ఒక గిన్నెలో నీళ్లు బాగా మరిగించి, ఆ వేడి నీళ్లలో బోటీ ముక్కలను వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి, చాకుతో లేదా చెంచాతో బోటీ పైన ఉన్న బూడిద రంగు పొరను గీరి తీసేయాలి.
-క్లీన్ చేసిన బోటీకి కాస్త పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మరసం లేదా పెరుగు పట్టించి బాగా రుద్ది కడగాలి. దీనివల్ల ఎలాంటి దుర్వాసన ఉండదు.
-శుభ్రం చేసిన బోటీ ముక్కలను కుక్కర్ లో వేసి మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కాక అందులో 1 ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత అందులో ఉడికించిన 250 గ్రాముల బోటీ, 1 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం బగా కలిసేలా కలుపుకోవాలి.
-తర్వాత మరో పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చేశాక అందులో 2 కట్టల గోంగూర ఆకులు వేసి వాటిని మంచి వేయించాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోండి.
-గ్రైండ్ చేసిన గోంగూర పేస్ట్ ని బోటీ ఉడుకుతున్న పాన్ లో వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 కప్పు నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేవరకు ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి అందులో కొంచెం గరం మసాలా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకొని ఒక నిమిషం ఉడికించి స్టవ్ ఆపేయాలి. అంతే గోంగూర బోటీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
