Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆవిరి పట్టిన వేడి వేడి మల్లెపూవు లాంటి ఇడ్లీలు ఉంటే ఆ మజాయే వేరు. అయితే ఇడ్లీలోకి కేవలం చట్నీ, సాంబార్ కంటే.. ప్లేట్లో కాస్త నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని, కమ్మటి ఇడ్లీ కారప్పొడి అద్దుకుని తింటే ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. హోటల్ స్టైల్ లో లేదా మన అమ్మమ్మల కాలం నాటి కమ్మని ఇడ్లీ పొడిని ఇంట్లోనే సులభంగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఇడ్లీ కారప్పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు
మినపప్పు - 1 కప్పు
పచ్చి శెనగపప్పు - అర కప్పు
పుట్నాల పప్పు (వేయించిన శెనగపప్పు) - 1 కప్పు
పచ్చి బియ్యం - పావు కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
కరివేపాకు - 1 పెద్ద రెమ్మ
ఎండుమిర్చి + బ్యాడిగి మిర్చి - మీ కారానికి తగినన్ని
ఇంగువ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

-ఈ కారప్పొడి రుచి అంతా పప్పులను వేయించడంలోనే ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి. మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి ఒక్కో పదార్థాన్ని విడివిడిగా వేయించుకోవాలి.
-ముందుగా మినపప్పును కడాయిలో వేసి దోరగా, కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పచ్చి శెనగపప్పును కూడా వేసి లేత బంగారు రంగులోకి మారేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు బియ్యాన్ని వేసి అవి కాస్త తెల్లగా పేలాల్లా ఉబ్బేలా వేయించాలి. పొడిలో బియ్యం వేయడం వల్ల దానికి మంచి కరకరలాడే స్వభావం వస్తుంది.
-ఆ తర్వాత తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. పుట్నాల పప్పును ఎక్కువ వేయించాల్సిన పనిలేదు, జస్ట్ కొద్దిసేపు వెచ్చబడితే సరిపోతుంది.
-ఇప్పుడు అర టీస్పూన్ నూనె వేసి ఎండుమిర్చి, బ్యాడిగి మిర్చిని మాడిపోకుండా వేయించుకోవాలి. చివరగా కరివేపాకును కూడా వేసి అందులో తడి అంతా పోయి క్రిస్పీగా వేయించుకోవాలి.
-వేయించిన పదార్థాలన్నీ బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే పొడి ముద్దగా అవుతుంది.
-చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, ఇంగువ వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులన్నీ వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పౌడర్ లా చేస్తే ఇడ్లీలోకి అంత రుచిగా ఉండదు.
-అంతే మీ ఇల్లంతా గుమగుమలాడే అద్భుతమైన ఇడ్లీ కారప్పొడి రెడీ.
-దీన్ని పూర్తిగా చల్లారాక గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకుంటే నెలల తరబడి తాజాగా, సువాసనతో ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలు లేదా నెయ్యి దోశల మీద ఈ పొడిని చల్లుకుని తింటే రుచి అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
