శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..

Posted By:

శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి మనం నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటివి తాగుతుంటాం. అయితే, వీటితో పాటు మన పెద్దలు సూచించిన కొన్ని సంప్రదాయ పానీయాలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో ప్రత్యేకమైనది గోండ్ కటీరా. దీనినే ఇంగ్లీషులో ట్రాగా కాంత్ గమ్ అని పిలుస్తారు. దీనికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. నీటిలో నానబెట్టగానే ఇది నీటిని పీల్చుకుని అచ్చం పారదర్శకమైన జెల్లీలా మారుతుంది.

గోండ్ కటీరా నీటిని అద్భుతంగా పీల్చుకుంటుంది కాబట్టి ఇది ఆహారంలో ఫైబర్‌ లా పనిచేసి జీర్ణక్రియకు సాయపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన ద్రవాలను అందించడంలో, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడటంలో ఉపయోగపడుతుంది. గోండ్ కటీరా డ్రింక్ ను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Grandma s Secret Gond Katira Drink is the Ultimate Hydrator Recipe in Telugu

గోండ్ కటీరా డ్రింక్ తయారీ విధానం

-ముందుగా ఒక చిన్న ముక్క లేదా ఒక టీస్పూన్ గోండ్ కటీరాను తీసుకుని శుభ్రంగా కడగాలి. దాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాలి.

-ఉదయానికి అది మెత్తటి, స్వచ్ఛమైన జెల్‌ లా మారుతుంది. అందులో ఇంకా ఏవైనా గట్టి ముక్కలు మిగిలి ఉంటే తీసేయాలి.

-ఇప్పుడు ఈ జెల్‌ ను ఒక గ్లాసు చల్లటి నీటిలో కలుపుకోవాలి. డ్రింక్ మరింత రుచిగా, సువాసనగా ఉండటానికి ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. తీపి ఇష్టపడేవారు కొద్దిగా తేనె లేదా తగినంత చక్కెర జోడించవచ్చు. మరింత కూల్‌ గా తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది.

-అంతే గొండ్ కటీరా డ్రింక్ రెడీ.

సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గోండ్ కటీరాను అతిగా తీసుకుంటే పొట్ట ఉబ్బరం, అజీర్తి, అసౌకర్యం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది నీటిని ఎక్కువగా పీల్చుకునే పదార్థం కాబట్టి, దీన్ని తీసుకున్నప్పుడు రోజువారీ త్రాగే ద్రవాల పరిమాణాన్ని కూడా పెంచాలి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక మందులు వాడేవారు, జీర్ణ సమస్యలు ఉన్నవారు దీన్ని వాడే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం ఉత్తమం.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 22, 2026, 9:14 [IST]
Desktop Bottom Promotion