అన్నం మిగిలిందా? కర్ణాటక స్పెషల్ టమాటో చిత్రాన్నం చేయండి..రుచి చూస్తే ఫిదా!

Posted By:

ప్రతి ఇంట్లోనూ మధ్యాహ్నం లేదా రాత్రి పూట అన్నం మిగిలిపోవడం చాలా సహజం. ఆ అన్నాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాం. పెరుగన్నం లేదా పులిహోర చేసి విసుగు పుట్టిందా? అయితే ఓసారి కర్ణాటక రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన, నోరూరించే టమాటో చిత్రాన్నం ట్రై చేయాల్సిందే.

ఇది కేవలం మిగిలిపోయిన అన్నాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు, ఒక అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ గా లేదా లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగపడుతుంది. సాధారణ టమాటో రైస్‌కి, కర్ణాటక స్టైల్ టమాటో చిత్రాన్నానికి చిన్న తేడా ఉంది. కర్ణాటక శైలిలో మనం వాడే మసాలా దినుసులు, ముఖ్యంగా సాంబార్ పౌడర్ లేదా వాంగీ బాత్ పౌడర్ వాడటం వల్ల దీనికి ప్రత్యేకమైన రుచి వస్తుంది.

Have Leftover Rice Turn it into this Mouth Watering Karnataka Style Tomato Chitranna

కావాల్సిన పదార్థాలు
-ఉడికించిన అన్నం
-టమాటోలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-నూనె
-ఆవాలు
-జీలకర్ర
-శెనగపప్పు
-మినపప్పు
-వేరుశెనగ గుళ్ళు (పల్లీలు)
-కరివేపాకు
-ఎండుమిర్చి
-ఇంగువ
-పసుపు
-కారం
-సాంబార్ పౌడర్
-ఉప్పు
-కొత్తిమీర
-పచ్చి కొబ్బరి తురుము

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చెయ్యాలి.

-వేడెక్కిన నూనెలో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరుశెనగపప్పు)వేసి ఎర్రగా వేపుకోవాలి. పల్లీలు సగం పైనే వేగిన తర్వాత ఇందులో 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1 టీస్పూన్ మినపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపాలి.

-వేగిన తాలింపులో రెండు చిటికెళ్ల ఇంగువ వేసి ఒకసారి పొంగనిచ్చాక ఇందులో 1 పెద్ద ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చి మిరపకాయల సన్నని తరుగు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేపాలి.

-ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అందులో 3 పండిన టమాటోల సన్నని తరుగు, కొత్తిమీర తరుగు కొంచెం వేసి మూతపెట్టి టమాటో ముక్కలు గుజ్జుగా అయ్యేదాకా మీడియం మంట మీద మగ్గించాలి.

-తర్వాత అందులో అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం వేసి ఒక నిమిషం వేపుకోవాలి.

-ఇప్పుడు అందులో 1కప్పు(180గ్రా)ఉడికించిన అన్నం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, కొంచెం కొత్తిమీర తరుగు, పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి పెద్ద మంట మీద కలుపుతూ ఉండాలి. మొత్తం బాగా కలిశాక స్టవ్ ఆపేయండి.

-అంతే టమాటో చిత్రాన్నం రెడీ. పుల్లపుల్లగా, కారంగా, కొంచెం తీపిగా ఉండే ఈ చిత్రాన్నం రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు.

-మిగిలిపోయిన అన్నం అయితే పొడిపొడిగా ఉండి, మసాలాను బాగా పీల్చుకుంటుంది. అందుకే తాజా అన్నం కంటే రాత్రి మిగిలిన అన్నంతో ఇది చాలా బాగా కుదురుతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 19, 2025, 10:20 [IST]
Desktop Bottom Promotion