Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
చుక్క నూనె లేకుండానే కిచిడి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేసుకోవాలంటే
ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు. తక్కువ నూనె, తక్కువ మసాలాతో తయారుచేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చుక్క నూనె లేదా నెయ్యి లేకుండా చేసే వంటకాలను తినేందుకు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నూనె, నెయ్యి లేకుండా తయారుచేసుకోగల టేస్టీ వంటకాల్లో కిచిడి ఒకటి. ఈ రెసిపీని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. చాలా తక్కువ పదార్థాలతోనే మంచి రుచిని పొందవచ్చు. చుక్క నూనె, నెయ్యి లేకుండానే కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-లవంగాలు
-యాలకలు
-స్టార్ అనాస
-బిర్యానీ ఆకు
-రాతి పువ్వు
-పచ్చిమిర్చి
-పెసరపప్పు
-నీళ్లు
-ఉప్పు
-మిరియాలు
-బీన్స్
-ఎండుకొబ్బరి తురుము
-క్యారెట్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీడిపప్పు
-కొత్తిమీర
-కరివేపాకు

తయారీ విధానం
-చుక్క ఆయిల్ లేకుండా టేస్టీ కిచిడి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేసుకోవాలంటే..
-ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు బియ్యం(250 గ్రాములు), అర గ్లాసు పెసరపప్పు(125గ్రా) వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాలి.
-కడిగిన బియ్యం,పెసరపప్పు మిశ్రమంలో మళ్లీ నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 2 యాలకలు, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, 10 మిరియాలు, రాతిపువ్వు కొంచెం, 1 స్టార్ అనాస వేసి తక్కువ మంట మీద 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
-తర్వాత అందులో సన్నగా,పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు,2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు దోరగా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బంగాళదుంప ముక్కలు, 7 బీన్స్ ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, 8 జీడిపప్పు పలుకులు, 6 పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
-ఉడికించేటప్పుడు ఏవీ మాడిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో 2 టీస్పూన్ నీళ్లు వేసుకుంటా బాగా కలుపుతూ ఉడికించాలి.
-తర్వాత అందలో 3 టీస్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఫ్రై చేసుకోండి.
-తర్వాత అందులో నానబెట్టిన బియ్యం,పెసరపప్పును వేసి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు అందులోని నీరు ఇగిరిపోయేదాకా మీడియం మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు,రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత తీసి చూస్తే వేడి వేడి కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications