Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
బొరుగులతో స్పాంజిలా మెత్తటి దోశలు..తేలికైన,రుచికరమైన బ్రేక్ ఫాస్ట్
మినప దోశ, రవ్వ దోశ, మసాలా దోశ, పెసరట్టు వంటివి మనకు సుపరిచితమైనవే. అయితే రోజూ అవే తిని విసుగు చెందినప్పుడు, ఏదైనా కొత్తగా, రుచిగా, ఆరోగ్యకరంగా ప్రయత్నించాలని అనిపిస్తుంది. అలాంటి వారందరి కోసం ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమే బొరుగుల దోశ.
బొరుగులను.. మరమరాలు అని కూడా పిలుస్తారు. వీటితో చేసే దోశలు చాలా తేలికగా ఉండటమే కాకుండా, జీర్ణం కావడానికి కూడా సులువుగా ఉంటాయి. బొరుగుల దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బొరుగులు (మరమరాలు) - 2 కప్పులు
దోశ బియ్యం - 1 కప్పు
అటుకులు- అర కప్పు
మినపప్పు - పావు కప్పు
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె- దోశలు కాల్చడానికి
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యం, మినపప్పు, మెంతులు వేసి నీళ్లు పోసి వాటిని శుభ్రంగా రెండు, మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి కనీసం 4 గంటల పాటు నానబెట్టాలి. మెంతులు వేయడం వల్ల దోశలకు మంచి రంగు, రుచి రావడమే కాకుండా, పిండి పులియడానికి కూడా సహాయపడతాయి.
-పిండి గ్రైండ్ చేయడానికి ఒక అరగంట ముందు మరొక గిన్నెలో బొరుగులను తీసుకుని, అవి పూర్తిగా మునిగే వరకు నీళ్ళు పోయాలి. బొరుగులు త్వరగా మెత్తబడతాయి, కాబట్టి వాటిని ఎక్కువ సేపు నానబెట్టాల్సిన అవసరం లేదు.
-అదే సమయంలో అటుకులను కూడా శుభ్రంగా కడిగి, కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టాలి.
-నానబెట్టిన బియ్యం, మినపప్పు మిశ్రమంలోని నీటిని వంపేసి వాటిని మిక్సీ జార్ లేదా గ్రైండర్ లోకి తీసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మెత్తని పిండిలా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు నానబెట్టిన బొరుగులలోని నీటిని చేతితో గట్టిగా పిండి వాటిని కూడా మిక్సీ జార్లో వేయాలి. అలాగే నానబెట్టిన అటుకులను కూడా నీటితో సహా వేయాలి. ఈ మిశ్రమాన్ని మరోసారి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి జారుగా దోశ పిండిలా ఉండాలి. మరీ గట్టిగా లేదా మరీ పల్చగా ఉండకూడదు.
-రుబ్బుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, దానికి రుచికి సరిపడా ఉప్పు కలపాలి. గిన్నెపై మూత పెట్టి వెచ్చని ప్రదేశంలో కనీసం 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా పులియబెట్టాలి.
-పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలపాలి.
-తర్వాత గ్యాస్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి, ఒక ఉల్లిపాయ ముక్కతో లేదా టిష్యూ పేపర్ తో పెనం అంతా రుద్దాలి. ఇప్పుడు ఒక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో పోసి, నెమ్మదిగా గుండ్రంగా దోశలా పోయాలి.
-దోశ కింది భాగం బంగారు రంగులోకి మారి, అంచులు పైకి లేవడం ప్రారంభించినప్పుడు,దానిని రెండో వైపు తిప్పి, ఒక నిమిషం పాటు కాల్చాలి. అంతే వేడివేడి, రుచికరమైన బొరుగుల దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









