Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Energy Kheer: టీ,కాఫీ బదులు ఇది 1 కప్పు తాగితే చాలు..జన్మలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..ఎలా చేసుకోవాలంటే
టీ, కాఫీ రోజులో ఒక్కసారైనా తాగకపోతే చాలామందికి పొద్దుపోదు. అయితే మనం రోజూ తాగే టీ,కాఫీలకు ఓ కప్పు సగ్గుబియ్యం మఖానా ఖీర్ తాగి చూడండి.. మీ శరీరంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. సగ్గుబియ్యం మఖానా పాయసం అనేది రుచికరమైన, పోషకమైన స్వీట్. ఇది తక్కువ సమయంలో తయారుచేయడానికి వీలవుతుంది, ముఖ్యంగా పండుగల సమయంలో లేదా అల్పాహారంగా చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం, మఖానా రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండటం వల్ల ఈ పాయసం ఆరోగ్యకరమైన ఎంపికగా నిలుస్తుంది. ఎంటిత నీరసాన్నైనా తగ్గించి సత్తువనిస్తుంది ఈ పాయసం. నొప్పులను కూడా మాయం చేస్తుంది. ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అందించే సగ్గుబియ్యం మఖానా పాయసం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బెల్లం
-సగ్గుబియ్యం
-మఖానా
-బాదంపప్పు
-పిస్తాపప్పు
-నెయ్యి
-యాలకలు
-కుంకుమ పువ్వు

సగ్గుబియ్యం మఖానా ఖీర్ తయారీ విధానం
-ముందుగా పెద్ద సైజులో ఉండే అరకప్పు సగ్గుబియ్యం కనీసం 2 గంటలు నీళ్లలో నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు తురిమిన బెల్లం వేసి,ఇందులోనే పావు కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. జస్ట్ బెల్లం కరిగిన తర్వాత 1 నిమిషం వేడి చేసా గిన్నెను పక్కనపెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్తి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక 1 కప్పు పూల్ మఖానా వేసి ఫ్రై చేసుకోండి. 3-4 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని ఓ ఫ్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే మూడున్నర కప్పుల పాలు(750 ml) పోసి అవి పొంగువచ్చేదాకా మరిగించుకోవాలి.
-పాలు మరగడం ప్రారంభమయ్యాక అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలపండి. ఇందులో కొంచెం కుంకుమ్మ పువ్వు కూడా వేసి బాగా కలుపుతూ ఉడికించాలి
-ఇదే సమయంలో ఓ మిక్సీ గిన్నెలో 10 బాదంపప్పులు, 1 టీస్పూన్ పిస్తా పప్పు, 4 యాలకలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-సగ్గుబియ్యం ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బాదం పిస్తా పొడిని వేసి బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించాక ఇందులో సన్నగా తరిగిన 5 బాదంపప్పు ముక్కలు,ఫ్రై చేసి ఉంచిన పూల్ మఖానా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.
-కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలో ముందుగా తయారుచేసుకున్న బెల్లం సిరప్ ని వడకట్టి పోసి బాగా కలపండి. అంతే టేస్టీ సగ్గుబియ్యం మఖానా ఖీర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications