Latest Updates
-
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది!
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
ప్రసవం తర్వాత ఆడవారిలో తీవ్ర రక్తస్రావం, డెలివరీ నొప్పులు అధికంగా ఉంటాయి. ఒక బిడ్డకు జన్మనిచ్చేందుకు మరో జన్మ ఎత్తే తల్లుల ఆరోగ్యంపై ఇంట్లో పెద్దవారు తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. అందులో కీలకమైనది బాలింతలకు ఇవ్వాల్సిన ఆహారం. ఆ ఆహారం చాలా బలాన్నిచ్చేదిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనది లడ్డూ. పోషకాలు, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా అందించే ఈ లడ్డూను రోజుకి ఒక్కటైనా వారితో తినిపించాలి. ఆ హెల్తీ లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం..

బాలింతల కోసం లడ్డూ తయారీకి కావాల్సిన పదార్థాలు
బాదం- అర కప్పు
జీడిపప్పు- అర కప్పు
పిస్తా పప్పు- పావు కప్పు
ఎండు కొబ్బరి- రెండు
నెయ్యి- ఆరు టేబుల్ స్పూన్లు
గోండ్ కటీరా- 50 గ్రాములు
కిస్ మిస్- 50 గ్రాములు
గసగసాలు- రెండు టేబుల్ స్పూన్లు
గుమ్మడి గింజలు- అర కప్పు
సన్ఫ్లవర్ సీడ్స్- కప్పు
అవిసె గింజలు- అర కప్పు
తెల్ల నువ్వులు- అర కప్పు
పసుపు- రెండు టీస్పూన్లు
ఏలకుల పొడి- టీస్పూన్
ఎండు అల్లం పొడి- టీస్పూన్
బెల్లం- రెండు కప్పులు
బాలింతల కోసం లడ్డూ తయారీ విధానం
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి!
ముందుగా బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టుకోవాలి. బెల్లం తురిమి పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్పైన కడాయి పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగిన తర్వాత గోండ్ కటీరాను వేసి వేయించాలి. తర్వాత ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి.

అదే కడాయిలో బాదం, పిస్తా, జీడిపప్పుతో అన్ని రకాల గింజలను దోరగా వేయించుకోవాలి. పసుపు, ఏలకుల పొడి, ఎండు అల్లం పొడిని మినహాయించాలి.
ఇప్పుడు ఈ గింజలన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిలో ఎండు అల్లం పొడి, ఏలకుల పొడి కలుపుకోవాలి.
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
అదే కడాయిలో పసుపు వేసి వేయించి పొడిలో కలుపుకోవాలి. కడాయిలో మిగిలిన నెయ్యి వేసి కరిగి తర్వాత బెల్లం వేసి నీళ్లు పోయకుండా చిక్కగా ఉడికించాలి.
ఈ బెల్లం పానకాన్ని పొడిలో వేసి కలిపి లడ్డూల మాదిరిగా చేసుకోవడమే. బాలింతల కోసం ఆరోగ్యకరమైన, బలమైన లడ్డూలు రెడీ. రోజుకి ఒకటీ లేదా రెండు తినడం ద్వారా కండరాల బలానికి దోహదపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
