Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఇడ్లీ,దోశ కాదు..మన పూర్వీకులు పొద్దున్నే తిన్నది ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే
ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం. బిజీ షెడ్యూల్స్, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయ ఆహార పద్ధతులను తిరిగి అలవర్చుకోవడం ఎంతో అవసరం. అలాంటి వాటిలో ఒకటి జొన్న జావ. జొన్నలు మన దేశంలో వేల సంవత్సరాలుగా సాగు చేయబడుతున్న ఒక ముఖ్యమైన ధాన్యం. పోషకాల గని అయిన జొన్నలతో చేసే జావ కేవలం రుచికరంగానే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
జొన్నలను ఎక్కువగా రోటీలు, అంబలి, జావ రూపంలో తీసుకుంటారు. జొన్న జావా తయారు చేయడం చాలా సులభం. ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం తేలికపాటి ఆహారంగా దీనిని తీసుకోవచ్చు. జొన్న జావ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

జొన్న జావ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-నూనె
-జొన్న పిండి
-నీరు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-క్యారెట్
-కరివేపాకు
-ఆవాలు
-ఇంగువ
-కరివేపాకు
-ఉల్లిపాయ
-పసుపు
బాంబే కరాచీ హల్వా..ఇది స్వీట్ కాదు అమృతం..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
జొన్న జావ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి.
-తర్వాత అందులో పావు టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి చీలికలు, 1 క్యారెట్ చిన్న ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-లైట్ గా వేగిన తర్వాత అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపాక ఇందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసుకొని మూతపెట్టి మరిగించుకోవాలి.
-ఆ నీళ్లు మరిగేలోగా ఒక గిన్నెలో పావుకప్పు జొన్న పిండి వేసి అందులో అరకప్పు నీళ్లను కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండల్లేకుండా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాగా మరగుతున్న నీటిలో ఈ జొన్న పిండి మిశ్రమాన్ని పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
-కొంచెం చిక్కబడేదాకా ఉడికించి అందులో పచ్చికొబ్బరి తురుము కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే జొన్న జావ రెడీ. డయాబెటిస్ పేషెంట్లకు, బరువు తగ్దాలనుకున్నోళ్లకు ఇది చాలా మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
