Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఇడ్లీ,దోశ, పూరీ వద్దు..ఓ కప్పు పొద్దున్నే ఇది తింటే ఏ రోగాలు రావు,ఎలా చేయాలంటే
ఈ రోజుల్లో ఏది ఉన్నా లేకున్నా ఆరోగ్యం ఉంటే చాలు రా బాబు అనుకుంటున్నారు అంతా. అందుకే చాలామంది ఏది పడితే అది తినకుండా ఆరోగ్యకరమైన ఫుడ్ నే తింటున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆరోగ్యంగా ఉండటానికి అవి తినండి, ఇవి తినండి అని ప్రజలకు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఫుడ్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది మిల్లెట్స్. ఎండాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది.
వేసవిలో చలువచేసి నీరసం రాకుండా రోజంతా యాక్టివ్ గా ఆరోగ్యంగాఉండడానికి ఉదయాన్నే ఒకకప్పు రాగులతో చేసిన రైస్ తినాల్సిందే. అయితే దీనిని ఇంట్లో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగులతో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
రాగులు
పెసరపప్పు
నీళ్లు
ఉప్పు
పచ్చిమిర్చి
జీలకర్ర
ఇంగువ
జీడిపప్పు
మిరియాలు
జీడిపప్పు
తయారీ విధానం
-ముందుగా 1 టీగ్లాసు రాగులను శుభ్రంగా కడిగా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత 1 కప్పు పెసరప్పుని కలుపుతూ ఆయిల్ లేకుండా మంచి వాసన వచ్చేదాకా వేయించి పక్కనపెట్టాలి. చల్లారిన తర్వాత వీటిని నీళ్లు పోసి 1 గంటపాటు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి 8 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు కొంచెం వేడయ్యాక అందులో నానబెట్టిన రాగులను వేయాలి.
-రాగులు సగం ఉడికిన తర్వాత అందులో వేయించి నానబెట్టిన పెసరపప్పు వేసి కలిపి నెమ్మదిగా ఉడకనివ్వాలి.
-ఉడికి దగ్గరపడిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
-రాగులు, పెసరపప్పు ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి దించి పక్కపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేడి చేసి అందులో గుప్పెడు జీడిపప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు, రెండు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా కట్ చేసిన 1 స్పూన్ అల్లం ముక్కలు,పావు స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
-తర్వాత ఈ తిరగమాతను రాగులు, పెసరపప్పుతో చేసిన మిశ్రమంలో వేసి కలిపితే తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
