Latest Updates
-
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.!
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది!
బయట చిరుజల్లులు పడుతుంటే.. చల్లని గాలికి ఒళ్లు పులకరిస్తుంటే.. సాయంత్రం వేళ వేడి వేడి ఫిల్టర్ కాఫీ లేదా మసాలా టీ తాగుతూ ఏదైనా కరకరలాడే స్నాక్ తినాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటది. సాధారణంగా ఇలాంటి వాతావరణంలో మనకు వెంటనే గుర్తొచ్చేవి మిరపకాయ బజ్జీ, ఆలు బోండా, లేదా ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే ఉల్లిపాయ పకోడా. కానీ ఈసారి మీ వంటగదిలో కాస్త కొత్తదనాన్ని జోడించి, మరింత రుచికరమైన మష్రూమ్ ఆనియన్ పకోడీని ట్రై చేయండి.
బయట చాట్ షాపులు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంతో ఖరీదు పెట్టి కొనే ఈ ఎక్స్ ట్రా క్రిస్పీ, టేస్టీ స్నాక్ ని మీ ఇంట్లోనే చాలా సులభంగా, హైజీనిక్‌గా తయారు చేసుకోవచ్చు. పుట్టగొడుగుల్లో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

మష్రూమ్ ఆనియన్ పకోడీ తయారీకి కావాల్సినవి
తాజా పుట్టగొడుగులు (మష్రూమ్స్) - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ - 1
శనగపిండి - 4 నుండి 5 టేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి - 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టేబుల్ స్పూన్
పచ్చి మిరపకాయలు - 1
కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 2 రెమ్మలు
కారం పొడి - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - మీ రుచికి సరిపడా
వంట నూనె - డీప్ ఫ్రై చేయడానికి
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్!
మష్రూమ్ ఆనియన్ పకోడీ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో సన్నగా తరిగిన పుట్టగొడుగుల ముక్కలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా చేత్తో బాగా కలపాలి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో శనగపిండి, బియ్యప్పిండి, ఫ్రెష్ గా దంచిన అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి గట్టిగా కలుపుకోవాలి. పకోడా పర్ఫెక్ట్‌గా రావాలంటే పిండి తక్కువగా ఉండి, మష్రూమ్, ఆనియన్ ముక్కలు ఎక్కువగా కనిపించాలి. ఉల్లిపాయ, మష్రూమ్ లో ఉండే తేమ సరిపోతుంది, ఒకవేళ పొడిగా అనిపిస్తే చిటికెడు నీళ్లు మాత్రమే చల్లండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి, కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పకోడాల్లా వేయండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది.. పకోడీలు సగం ఉడికిన తర్వాత వాటిని నూనెలోంచి తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోండి.
-పకోడీలు అచ్చం బయట రెస్టారెంట్లో దొరికేలా కరకరలాడుతూ ఉండాలంటే, ఈ సగం వేయించిన పకోడాలను మళ్లీ వేడి నూనెలో వేసి, మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు డబుల్ ఫ్రై చేయండి.
-అంతే గుమగుమలాడే మష్రూమ్ ఆనియన్ పకోడీ కేవలం ఐదే నిమిషాల్లో రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications