Latest Updates
-
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్‌లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే!
ఎముకలను ఉక్కుగా మార్చే రాగులతో రవ్వ దోశ.. ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని కలిపితే తిరుగే ఉండదు.!
బ్రేక్‌ఫాస్ట్‌లో దోశ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నాపెద్దా ఇష్టంగా తినే టిఫిన్స్‌లో దోశ ముందుంటుంది. ఆయిల్ తక్కువగా ఉండటంతో పాటు త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అయితే ప్రస్తుతం దోశల్లో ఎక్కువగా వెరైటీలు, ఆరోగ్యానికి ఎక్కువగా మేలు చేసేవాటికి ప్రాధాన్యతనిస్తున్నారు. వాటిలో రాగి దోశ ముందుంటుంది. ఈ క్రమంలో ఈ సారి రాగి పిండిలో వీటిని కలిపి పల్చటి దోశలు వేసి చూడండి.. ఇంటిల్లిపాదీ ఖుషీ అయిపోవాల్సిందే..

రాగి రవ్వ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాగి పిండి- ఒక కప్పు
బియ్యం పిండి- అరకప్పు
బొంబాయి రవ్వ- పావు కప్పు
ఉల్లిపాయ- ఒకటి
పెరుగు- అరకప్పు
నీరు- నాలుగు కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
జీలకర్ర- టీ స్పూన్
క్యారెట్- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
అల్లం ముక్క- చిన్నది
కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా
రాగి రవ్వ దోశ తయారీ విధానం
ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, బియ్యపు పిండి, బొంబాయి రవ్వ వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, పెరుగు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర కరివేపాకు, ఉప్పు వేసి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి.
ఇప్పుడు అందులో నీళ్లు పోసి పిండి జారుగా ఉండేలా నీరు దోశ పిండిలా చేసుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా కలియతిప్పాలి. ఓ పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీంతో క్యారెట్, ఉల్లిపాయ ఫ్లేవర్ పిండిలోకి చేరుతుంది. పెరుగులోని ప్రొబయాటిక్స్, జీలకర్ర ఫ్లేవర్, పిండిలోకి పీల్చుకుని దోశను రుచికరంగా మారుస్తాయి.
ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. బాగా వేడయ్యాక కొద్దిగా నూనె అప్లై చేసి ఉల్లిపాయ ముక్కతో రుద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశ పిండిని గరిటెతో పల్చగా పెనం పైన పోసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. అంతే రుచికరమైన హెల్తీ రాగి రవ్వ దోశ రెడీ. ఈ దోశలను వేడివేడిగా పల్లీ చట్నీ, టమాటా పచ్చడితో ఆ రుచి అద్భుతంగా ఉంటుంది.
పోషకాలు పుష్కలం
రాగి రవ్వ దోశలో కాల్షియం, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో అల్పాహారంగా తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. పిల్లలకు చిన్న వయసులోనే వీటిని అలవాటు చేయడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఈ బ్రేక్‌ఫాస్ట్ మంచి ఆప్షన్. వీటిలో ఫైబర్ సైతం అధికంగానూ ఉంటుంది. క్యారెట్‌ను కలుపుకోవడం ద్వారా పీచు పదార్థం మరింత మెరుగై జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్తో బాధపడుతున్న వారు రాగి రవ్వ దోశ తినడం ద్వారా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. రాగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న కారణంగా రక్తంలో చక్కెర చేరకుండా కాపాడుతుంది. త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉన్న కారణంగా దంతాలు కూడా దృఢంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications