Latest Updates
-
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.!
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
రోజూ ఒకే రకమైన చపాతీలు, రోటీలు తిని మీకు విసుగొచ్చిందా? అయితే ఈ వీకెండ్ లో పాలక్ పన్నీర్ చపాతీ ట్రై చేయండి. చూడటానికి ఆకుపచ్చని రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, తినడానికి వెన్నలా మృదువుగా ఉండే ఈ చపాతీలు మీ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా నచ్చుతాయి.
ముఖ్యంగా ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇలా చపాతీల్లో కలిపి పెడితే, వాళ్లు ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తింటారు. వాళ్లకు తెలియకుండానే వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇందులో పాలకూర ద్వారా లభించే ఐరన్, పన్నీర్ ద్వారా వచ్చే అత్యుత్తమ ప్రొటీన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఒక కంప్లీట్ హై ప్రొటీన్ అండ్ హెల్తీ మీల్ అని చెప్పవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా మన రెగ్యులర్ చపాతీ చేసినంత సులువు. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
పాలకూర - 1 కట్ట
పన్నీర్ తురుము లేదా ముక్కలు - 1 కప్పు
పచ్చిమిర్చి - 1 లేదా 2
అల్లం - 1 అంగుళం ముక్క
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - అర టీస్పూన్
స్వచ్ఛమైన నెయ్యి - చపాతీలు కాల్చుకోవడానికి తగినంత
నీళ్లు - అవసరమైనంత
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శుభ్రం చేసుకున్న పాలకూర ఆకులు, సాఫ్ట్ గా ఉన్న పన్నీర్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి. ఇవన్నీ మెత్తని పేస్ట్ లా మారడానికి కొద్దిగా నీళ్లు జతచేసి, ఎక్కడా ఉండలు లేకుండా చాలా స్మూత్ ప్యూరీలా మిక్సీ పట్టుకోవాలి. పన్నీర్ వేయడం వల్ల ఈ ప్యూరీకి కమ్మని రుచి వస్తుంది.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పాలక్-పన్నీర్ ప్యూరీని గోధుమ పిండిలో వేసి బాగా కలపాలి. ప్యూరీలోని తడి సరిపోకపోతేనే కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా చాలా మృదువుగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పిండిపై మూత పెట్టి పక్కన ఉంచితే చపాతీలు మరింత మృదువుగా వస్తాయి.
-నానిన పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చపాతీ పీటపై కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకుంటూ, చపాతీ కర్రతో గుండ్రంగా, సమాన మందంతో రోటీల్లా ఒత్తుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయాలి. వత్తుకున్న రోటీని దానిపై వేసి రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మీడియం మంటపై దోరగా కాల్చుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, పోషకాలతో నిండిన పాలక్ పన్నీర్ చపాతీలు రెడీ. పన్నీర్ వాడటం వల్ల ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా సేపటి వరకు మృదువుగానే ఉంటాయి కాబట్టి పిల్లల లంచ్ బాక్స్‌లకు కూడా ఇవి పర్ఫెక్ట్ గా సరిపోతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
