Latest Updates
-
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా!
భేల్ పురి, పానీపూరి, కారపు మిక్చర్, చాట్.. ఇలా ఎన్నో రకాల నోరూరించే చిరుతిళ్లకు మరమరాలే ప్రాణం. కొద్దిగా కారం, మసాలాలు జోడించి స్పైసీగానూ.. లేదా బెల్లం, చక్కెర పాకంతో తీయటి లడ్డూలుగానూ ఎలా తిన్నా వీటి రుచే వేరు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ తేలికపాటి స్నాక్ ను ఎంతగానో ఇష్టపడతారు.
సాధారణంగా మనం మరమరాలను బయట మార్కెట్లో కొనుగోలు చేస్తుంటాం. అవి సులభంగా దొరుకుతాయి కాబట్టి వాటిని ఇంట్లో తయారు చేయాలనే ఆలోచన పెద్దగా రాదు. కానీ ఇంట్లోనే అత్యంత పరిశుభ్రంగా, సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? కేవలం బియ్యం, ఉప్పు, నీళ్లు ఉంటే చాలు.. కరకరలాడే మరమరాలు నిమిషాల్లో సిద్ధమవుతాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మరమరాలు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యం తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పోసి, కనీసం అరగంట పాటు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల బియ్యం చక్కగా ఉబ్బుతాయి.
-ఆ తర్వాత బియ్యాన్ని ఒక జల్లెడలో వేసి నీరంతా పోయేలా వడకట్టండి. ఇప్పుడు ఒక పొడిగా ఉన్న కాటన్ క్లాత్ లేదా ఒక పెద్ద పళ్ళెం తీసుకుని, ఈ బియ్యాన్ని పలుచగా పరచి ఎండలో బాగా ఆరబెట్టండి. బియ్యంలో తేమ ఏమాత్రం ఉండకూడదు. పూర్తిగా పొడిగా అయితేనే మరమరాలు పర్ఫెక్ట్‌గా పొంగుతాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక కడాయి పెట్టండి. అందులో ఒక కప్పు తెల్లటి ఉప్పు వేసి బాగా వేడి చేయండి. ఉప్పు అంతటా సమానంగా వేడెక్కేలా గరిటెతో తిప్పుతూ ఉండండి.
-ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత మంటను హై ఫ్లేమ్ లో ఉంచి, ఆరబెట్టిన బియ్యాన్ని అందులో వేయండి. గరిటెతో నిరంతరం కలుపుతూనే ఉండండి. కొద్ది క్షణాల్లోనే మ్యాజిక్ జరిగినట్లు బియ్యం గింజలు పటాకుల్లా పేలుతూ మరమరాలుగా ఉబ్బడం మీరు గమనిస్తారు.
-బియ్యం పూర్తిగా ఉబ్బిన వెంటనే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఉప్పు, మరమరాల మిశ్రమాన్ని ఒక పెద్ద జల్లెడలోకి తీసుకుని జల్లించండి. అదనంగా ఉన్న ఉప్పు కిందకు పడిపోతుంది.
-అంతే కరకరలాడే వేడివేడి మరమరాలు రెడీ.
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
నూనెతో తయారుచేసే మరో సులభమైన పద్ధతి
మీరు ఉప్పుతో కాకుండా నూనెతో కూడా వీటిని తయారు చేయవచ్చు. దీనికోసం ముందుగా బియ్యాన్ని కాసేపు ఉడకబెట్టి, ఎండలో బాగా ఆరబెట్టాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసి, ఆరబెట్టిన బియ్యాన్ని అందులో వేయాలి. ఒక్క నిమిషం పాటు వేయిస్తే చాలు.. బియ్యం పూలు వికసించినట్లుగా మరమరాలుగా మారిపోతాయి.
ఏ బియ్యం వాడాలి?
ఇంట్లో పర్ఫెక్ట్ మరమరాలు రావాలంటే లావుగా ఉండే బియ్యం లేదా ఉప్పుడు
బియ్యం (పారాబాయిల్డ్ రైస్) వాడటం ఉత్తమం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
