Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
నార్త్ ఇండియా ఫేమస్ 'ఆలూ లచ్చా పరాఠా'..ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్
సాధారణంగా నార్త్ ఇండియాలో పరాఠాలను ఎక్కువగా తింటుంటారు. దక్షిణాదిలో కొన్ని ప్రాంతాలలోనే వీటిని తింటుంటారు. అయితే నార్త్ ఇండియాలో అయితే ఎక్కడికెళ్లినా ఉదయం బ్రేక్ పాస్ట్ లోకి, మధ్యాహ్నాం లంచ్ లోకి,నైట్ డిన్నర్ లోకి కూడా పరాఠాలను తింటుండటం మనం చూడవచ్చు. పరాఠాలలో కూడా అనేక రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఆలు లచ్చా పరాటా. ఆలూ లచ్చా పరాఠా ఒక రుచికరమైన,ఆరోగ్యకరమైన వంటకం. ఇది పిల్లలకు, పెద్దలకు అందరికీ నచ్చుతుంది. దీనిని బంగాళాదుంప, గోధుమ పిండి, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు.
ఆలూ లచ్చా పరాఠా పొరలుగా ఉండే ఒక రకమైన పరాఠా. ఇది సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా లేదా భోజనానికి సైడ్ డిష్ గా వడ్డిస్తారు. దీనిని మీరు మీ ఇంట్లో కూడా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఆలూ లచ్చా పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఆలూ లచ్చా పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
ఉడికించిన బంగాళాదుంపలు: 2 (గుజ్జుగా చేసుకోవాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
గరం మసాలా: 1/2 టీస్పూన్
ధనియాల పొడి: 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి: 1/4 టీస్పూన్
పసుపు పొడి: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కాల్చడానికి సరిపడా
ఆలూ లచ్చా పరాఠా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. కొద్దిగా నీరు పోస్తూ మెత్తని పిండి ముద్దలా చేసుకోవాలి. పిండిని 15 నిమిషాలు నానబెట్టాలి. పరాఠా మృదువుగా రావాలంటే పిండిని బాగా నానబెట్టాలి.
-తర్వాత ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
-పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి.
-ఒత్తిన చపాతీపై బంగాళాదుంప మిశ్రమాన్ని సమానంగా పరచాలి. బంగాళాదుంప మిశ్రమాన్ని సమానంగా పరచడం వల్ల పరాఠా రుచిగా ఉంటుంది. మీకు ఇష్టమైన కూరగాయలను కూడా బంగాళాదుంప మిశ్రమంలో చేర్చవచ్చు.
-చపాతీని రోల్ చేసి మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలి. లచ్చా పరాఠా చేసేటప్పుడు చపాతీలను సన్నగా ఒత్తుకోవడం వలన పొరలు బాగా వస్తాయి.
-ఇప్పుడు ఒక పాన్ వేడి చేసి దానిపై పరాఠాను వేసి రెండు వైపులా
బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి.
పరాఠా కాల్చేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి.
-పరాఠాలను నెయ్యితో కాల్చడం వలన రుచి మరింత పెరుగుతుంది. అంతే ఆలూ లచ్చా పరాఠా రెడీ.
-వేడి వేడి ఆలూ లచ్చా పరాఠాను పెరుగు లేదా చట్నీతో తింటే అదిరిపోతుంది.
దహీ తడ్కా శాండ్ విచ్..ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా అంటారు,ఎలా చేయాలంటే
ఆలూ లచ్చా పరాఠా ప్రయోజనాలు
ఆలూ లచ్చా పరాఠాలో బంగాళాదుంపలు, గోధుమ పిండి ఉంటాయి. ఇవి రెండూ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను కలిగి ఉంటాయి. బంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. గోధుమ పిండిలో ఫైబర్, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. బంగాళదుంపలు పిండిపదార్ధాలను కలిగి ఉండటం వలన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. గోధుమ పిండిలో ఉండే పీచు పదార్ధం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












