Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్పీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
అమృతం అనిపించే పాతకాలం నాటి లక్ష్మిచారు..సమ్మర్ లో ఒంట్లో వేడి పోగొడుతుంది, ఎలా చేసుకోవాలంటే..
లక్ష్మిచారు గురించి మీరెప్పుడైనా విన్నారా? ఇదొక పురాతన కాలం నాటి వంటకం. బియ్యం కడిగిన నీటితో దీనిని తయారు చేస్తారు. దీనికి ప్రత్యేక రుచి, పోషక విలువలు ఉంటాయి. సాధారణంగా సమ్మర్ సీజన్ లో చల్లబరచటానికి,శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి తీసుకునేటోళ్లు. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది దీనిని తయారుచేస్తుంటారు. దీనిని మీ ఇంట్లో కూడా ట్రై చేయవచ్చు. పాతకాలం నాటి వంటకం లక్ష్మిచారుని తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
లక్ష్మిచారు తయారీకి కావలసిన పదార్థాలు
-బియ్యం కడిగిన నీళ్లు - 4 కప్పులు ( 2 రోజుల పాటు మట్టి కుండలో
నిల్వ చేసినది)
-నానబెట్టిన చింతపండు రసం - 1/4 కప్పు
-ఉల్లిపాయ - 1
-టమాటో - 1
-పచ్చిమిర్చి - 2-3
-కరివేపాకు - కొద్దిగా
-ఆవాలు - 1/2 టీస్పూన్
-జీలకర్ర - 1/2 టీస్పూన్
-మెంతులు - 1/4 టీస్పూన్
-ఎండుమిర్చి - 2
-పసుపు - 1/4 టీస్పూన్
-ఉప్పు -సరిపడా
-కొత్తిమీర - కొద్దిగా
-ఇంగువ - చిటికెడు
-ఆయిల్
-కూరగాయలు- బెండకాయ ముక్కలు, మునగకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు మొదలైన
మీకు నచ్చినవి.

లక్ష్మిచారు తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని కడిగిన నీరు పారబోయాలి. రెండోసారి బియ్యం కడిగి ఆ కడిగిన నీళ్లను మట్టికుండలో లేదా గిన్నోలో పోసి కనీసం రెండు రోజులు పులియబెట్టాలి. పులియబెట్టిన నీరు చారుకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
-తర్వాత బెండకాయ, మనగకాయ లేదా సొరకాయ వంటి మీకు నచ్చిన కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కొన్ని ప్రాంతాల్లో ఇందులో తోటకూర కూడా వేస్తారు.
-ఇప్పుడు అడుగు మందం కలిగిన గిన్నె పొయ్యి మీద పెట్టి అందులో పులియబెట్టిన బియ్యం నీళ్లను పోయాలి.
-తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు,పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇందులోనే కట్ చేసిన కూరగాయలు కూడా వేయండి. మూతపెట్టి కూరగాయలు మెత్తబడేయ వరకు ఉడకనివ్వాలి. దీనికి 10-15 నిమిషాల సమయం పడుతుంది.
-కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత అందులో నానబెట్టిన నిమ్మిపండు సైజు అంత చింతపండు రసం వేసి వేసి బాగా కలిపి చారు మరో 5-7 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ వేడి చేశాక ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత జీలకర్ర, మెంతులు,ఎండుమిర్చి,ఇంగువ వేసి వేయించండి. ఈ తాళింపుని మరుగుతున్న చారులో వేసి కలపండి.
-ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా ఆ చారులో కొత్తిమీర తరుగు చల్లుకొని దించేసుకోండి. అంతే లక్ష్మిచారు రెడీ. సంప్రదాయకంగా ఈ చారుని మట్టికుండలో తయారుచేస్తారు. మీకు పాధ్యమైతే మట్టికుండలో దీనిని తయారుచేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications