Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన స్వీట్ ఇదే..అందుకే అంత ఎనర్జీ,ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే వందల రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ పూర్వకాలంలో కొన్ని రకాల స్వీట్లు మాత్రమే తరుచుగా తింటుండేవాళ్లు. అది కూడా ఆరోగ్యకరమైన స్వీట్లు తినేవాళ్లు కాబట్టే వాళ్లకి రోగాలు కూడా తక్కువ ఉండేవి. కొండలు అయినా పిండి చేసేటంతటి బలం ఉండేది. అలాంటి ఆరోగ్యకరమైన పాతకాలం నాటి సంప్రదాయ స్వీట్ లలో తిమ్మనం ఒకటి. ఇది తింటుంటే ఎంత తిన్నాం అని కూడా ఆలోచించరు. నోట్లో ఐస్ క్రీమ్ లా కరిగిపోయే పాలకాలంనాటి ఆరోగ్యకరమైన తిమ్మనం స్వీట్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తిమ్మనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చి కొబ్బరి
-బెల్లం
-యాలకల పొడి
-జీడిపప్పు
-బాదంపపప్పు
-పాలు
-నెయ్యి
-ఎండుద్రాక్ష

తిమ్మనం తయారీ విధానం
-అరకప్పు అన్నం వండుకునే బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో గంటసేపు నానిన బియ్యం, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అక కప్పు నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండున్నర కప్పుల పాలను మరిగించాలి.
-పాలు మరగడం మొదలైన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ వేసి మంటను లో ప్లేమ్ లో ఉంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
-బాగా ఉడికి దగ్గరపడి క్రీమ్ లా అయిన తర్వాత దించేసి పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత అరస్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పాలు బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం పాకం అందులో పోసి కలపండి. ఇందులోనే నెయ్యిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,బాదం పలుకులు వేసి కలపండి. అంతే టేస్టీ,హెల్తీ తిమ్మనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications