Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
అన్ని వయస్సుల వాళ్లు మెచ్చే ఏకైక స్వీట్..పాలకోవా ఇలా చేస్తే టేస్ట్ అదరహో
స్వీట్ షాపులకి వెళ్తే అందరి కళ్లు ముందు వరుసలో ఉండే పాలకోవా మీదనే పడతాయి. పాలకోవాని చూస్తుంటే తినకుండా నోరు కట్టేయడం ఎవరివల్లా కాదు. పిల్లల నుంచి పెద్దల నుంచి అన్ని వయస్సుల వారికి పరిచయం ఉన్న ఏకైక స్వీట్ ఇదే. ముఖ్యంగా ఏపీ, తెలంగా, తమిళనాడు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ స్వీట్. పాలతో తయారు చేయబడే ఈ స్వీట్ దాని మృదువైన తీపి రుచికి ప్రసిద్ధి చెందినదే కాకుండే అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
పాలకోవాలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు,ప్రొటీన్లు కూడా ఉంటాయి. అమ్మమ్మల కాలంలో ఇంట్లోనే చేసుకొని తినే ఈ సంప్రదాయ స్వీట్ ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తినాలిపించేవారికి ప్రతిషాపులోనూ దర్శనమిస్తుంది. అయితే ఈ ఫేమస్ స్వీట్ ని ఇంట్లోనే చేసుకోవడం చాలా ఈజీ. పాలకోవా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

పాలకోవా తయారీకి కావాల్సిన పదార్థాలు
పాలు: 1 లీటరు (ఫుల్ క్రీమ్ పాలు)
చక్కెర: 1/2 కప్పు
యాలకుల పొడి: 1/4 టీస్పూన్
నెయ్యి: 1 టీస్పూన్
బందర్ అంటే లడ్డూ ఫేమస్ అనుకుంటిరా..ఈ వరల్డ్ ఫేమస్ స్వీట్ తింటే స్వర్గమే,ఎలా చేయాలంటే
పాలకోవా తయారీ విధానం
-మందపాటి అడుగు కలిగిన ఒక పెద్ద గిన్నెలో పాలు పోసి పాలు సగానికి తగ్గే వరకు మరిగించాలి. పాలు అడుగంటకుండా తరచూ కలుపుతూ ఉండాలి.
-పాలు చిక్కబడిన తర్వాత చక్కెర వేసి పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి.
-పాలు మరింత చిక్కగా మారి కోవా ఆకృతిని పొందే వరకు మరిగించడం కొనసాగించాలి.
-కోవా గిన్నె అంచులను వదిలి ఒక ముద్దలాగా ఏర్పడినప్పుడు అందులో యాలకుల పొడి వేసి కలపాలి.
-తర్వాత అందులో నెయ్యి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించాలి.
ఇది కోవాకు అదనపు రుచిని ఇస్తుంది.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, కోవాను కొద్దిగా చల్లారనివ్వాలి. అంతే
పాలకోవా రెడీ.
-కోవా గోరువెచ్చగా ఉన్నప్పుడు దానిని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు.
-పాలకోవాకు అదనపు రుచిని జోడించడానికి, మీరు కుంకుమపువ్వు లేదా ఇతర డ్రై ఫ్రూట్స్ను కూడా ఉపయోగించవచ్చు.
పాలకోవాను ఫ్రిజ్ లో పెట్టుకుంటే కొన్నిరోజుల వరకు నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
