Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
చిలకలూరిపేట స్పెషల్ స్వీట్ రెసిపి..వేళ్లు కూడా జుర్రుకొని తింటారు,ఎలా చేయాలంటే
పాలతాళికలు ఎప్పుడైనా తిన్నారా? తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా పండుగల సమయంలో వీటిని ఎక్కువగా ఇళ్లల్లో చేస్తుంటారు. వినాయకచవితి సందర్భంగా ప్రత్యేకంగా దీనిని ఇంట్లో చేస్తారు. చిలకలూరిపేట, కోనసీయ ఏరియాల్లో అయితే దాదాపు ప్రతి ఇంట్లో దీనిని చేస్తుంటారు. వీటి టేస్ట్ ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోరు. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. చాలా రుచికరంగా ఉండే పాలతాళికలను ఇంట్లోనే ఈజీగా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పాలతాళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యంపిండి
యాలకలు
పాలు
బెల్లం
సగ్గుబియ్యం
నీళ్లు

పాతతాళికలు తయారీ విధానం
-పావు గ్లాస్ సగ్గు బియ్యం 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత ఓ బౌల్ లో రెండు గ్లాసుల బెల్లం వేసి అందులో 1 గ్లాసు నీళ్లు, నాలుగు యాలకలు వేసి కలుపి ఈ బౌల్ ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ పాకం పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసి అందులో రెండు స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి ఇందులో 1 గ్లాసు బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా దగ్గరపడేవరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత దానిని చపాతి పిండి కలిపినట్లు కలుపుకోవాలి.
-తర్వాత చేతికి ఆయిల్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని తాళికలుగా(పొడవుగా తీగలా) చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో మూడు గ్లాసుల పాలు పోసి బాగా కాగిన తర్వాత అందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం పైకి తేలితే ఉడికినట్లే.
-తర్వాత అందులో తాళికలు వేసేయాలి. అసలు కలపకూడదని గుర్తుంచుకోండి. మంటలను సిమ్ లో పెట్టి 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి.
-ఈలోగా ఓ బౌల్ లో 1 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలిపి ఈ మెత్తాన్ని స్టవ్ మీద ఉన్న తాళికలలో కొంచెం కొంచెంగా వేసుకోండి. 2 నిమిషాలు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
-2 నిమిషాల తర్వాత అందులో ముందుగా రెడీ చేసిన బెల్లం పాకం వేసి కలపండి. తర్వాత ఇందులో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి. అంతే పాలతాళికలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
