Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
అవియల్ కర్రీ.. మిక్స్‌డ్ కూరగాయలు, పెరుగుతో చేసే ఈ డిష్ అదిరిపోతుంది..!!
అవియల్ కర్రీ కేరళలో చాలా ప్రత్యేకమైన వంటకం. ఎన్నో రకాల కూరగాయలతో ఈ వంటకాన్ని రెడీ చేసుకుంటాం. అవియల్ కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అవియల్‌లో ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయ్. తమిళనాడులో కూడా ఈ వంటకాన్ని ఎక్కువగా వుండుతుంటారు. మహాభారతంలో కూడా ఈ అవియల్ గురించి ప్రస్తావన ఉంది. భీముడు అన్ని కూరగాయలను కలిపి ఉడికించి దాంట్లో కొబ్బరి,పచ్చిమిర్చి, మజ్జిగ వేయడం వల్ల ఈ వంటకం తయారైందని అంటారు. అవియల్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
అవియల్‌ను తయారు చేయడానికి కావాల్సిన వంట పదార్థాలు ఇవే :
క్యారట్, బీన్స్, బంగాళాదుంప, అరటికాయ, చామదుంప, ముల్లంగి,
బీట్రూట్ - 2 కప్పులు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి.
శెనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మెంతులు - 1/2 టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
కరివేపాకు - కొన్ని
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - తగినంత
కొబ్బరి తురుము - 1 కప్పు
మజ్జిగ - 1 కప్పు
కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర గింజలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1/2 టీస్పూన్
పచ్చి మిర్చి - 3
ఇంగువ - చిటికెడు
అవియల్‌ను ఈ కింది విధంగా రెడీ చేసుకోవాలి :
ముందుగా అన్ని కూరగాయలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ కూరగాయలన్నింటినీ ఒక బౌల్‌లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కడగాలి. దీని వల్ల ఏదైనా చెత్త ఉంటే తొలగిపోతుంది.
స్టవ్‌పైన ఒక గిన్నెను పెట్టి అందులో కట్ చేసిన కూరగాయలన్నింటినీ వేసుకొని తగినంత నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. కూరగాయలు మెత్తగా అయ్యేంత వరకూ నీళ్లల్లో ఉడకబెట్టుకోవాలి.
మిక్సీ జార్ కొత్తిమీర గింజలు, జీలకర్ర, పచ్చి మిర్చి, హింగు వేసి పేస్ట్‌లా నూరుకోవాలి. ఈ పేస్ట్‌ను ఉడికిన కూరగాయలలో కలపాలి. కూరగాయల పేస్ట్ లో మజ్జిగను పోసి బాగా కలపాలి. స్టవ్‌పైన ఇది బాగా మసిలిన తరువాత కిందకు దించేసుకోవాలి.
ఒక చిన్న పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేయాలి. ఇందులో ఆవాలు, శెనగపప్పు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. ఈ తాలింపును కూరగాయ మజ్జిక మిక్స్‌లో కలుపుకోవాలి..
ఆవియల్‌ను కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఇక దీంతో అవియల్ రెడీ అయినట్టే. అన్నంతో, చపాతీతో ఈ అవియల్ చాలా బాగుంటుంది. కొంత మంది అవియల్‌ను అలాగే తింటుంటారు.
చిట్కాలు:
మీకు ఇష్టమైన కూరగాయలను ఈ వంటకంలో ఉపయోగించవచ్చు.కొబ్బరి నూనెకు బదులుగా సాధారణ నూనెను పోసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో రుచి బాగా వస్తుంది.
అవియల్‌ను వేడి అన్నంలోకి లేదా చపాతీ, పూరీ వంటి పిండి పదార్థాలతో సర్వ చేసుకోవచ్చు. అవియల్‌ను సాంబారు పక్కన పెట్టి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది. అలాగే, వడియాలు, పాపడాలు వంటి క్రంచీ ఐటమ్స్ తో కూడా మంచి కాంబినేషన్ అవుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












