Latest Updates
-
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
ఎప్పుడూ ఒకే స్టైల్లో చన్నా మసాలా చేయకండి.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అద్దిరిపోద్ది
Channa Masala Recipe సాధారణంగా మనం రెస్టారెంట్ లేదా ఢాబాకు వెళ్ళినప్పుడల్లా రుమాలీ రోటీ లేదా తందూరి రోటీతో చన్నా మసాలాను ఆర్డర్ చేస్తాము. ఇది ఆహార ప్రియులందరికీ ఇష్టమైన ఆహారం. అయితే ఈ చన్నా మసాలా డిఫరెంట్ స్టైల్లో వండితే రెస్టారెంట్ ఫీల్ వస్తుందది. ప్రతి సారి రెస్టారెంట్లు లేదా డాబాలకు వెళ్లి ఈ ఆహారాన్ని రుచి చూడటం సాధ్యం కాదు. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నది, ఆరోగ్యం మీద ఏకాగ్రత పెంచుకోవడం, ఇన్ఫెక్షన్ల బారీన పడకుండా నివారించడానికి బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. అయితే చింతించాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే మంచి రెస్టారెంట్ ఫ్లేవర్ చన్నా మసాలా తయారు చేసుకోండి.
ఇది రైస్ , రోటి, చపాతీ దేనికైనా సరే చన్నా మసాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు ఈ రాత్రి మీ ఇంట్లో చపాతీ లేదా పూరీని తయారు చేయాలనుకుంటున్నారా? మీ ఇంటివారు సైడ్ డిష్‌గా చన్నా మసాలా అడుగుతారా? ఇప్పటి వరకు అదే స్టైల్లో చన్నా మసాలా వండి ఉంటారు అయితే ఈ రోజు కాస్త డిఫెరెంట్ గా తయారుచేయండి . ఈ తరహా చన్నా మసాలా తయారు చేయడం చాలా సులభం మరియు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.

Image courtesy
చన్నా మసాలా రిసిపి ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? క్రింద చన్నా మసాలా రెసిపీ సాధారణ వంటకం ఉంది. మీరు కూడా ప్రయత్నించి రుచి చూసి మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి.
కావాల్సిన పదార్థాలు :
*చిక్పీస్ (బ్రౌన్ కలర్ శెనగలు)- 200 గ్రాములు (నీళ్లలో
నానబెట్టి)
* నూనె - 3 టేబుల్ స్పూన్లు
* జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
* దాల్చిన చెక్క - 2 ముక్కలు
* లవంగాలు - 4
* ఏలకులు - 4
* స్టార్ ఆనీ - 1
* బిర్యానీ ఆకులు - 1
* ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
* టొమాటోలు - 2 (తరిగినవి)
* అల్లం పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి - 1 టేబుల్ స్పూన్
* బెల్లం పొడి - 1 1/2 tsp
* గరం మసాలా - 1/2 tsp
* ఉప్పు - రుచి ప్రకారం
* కొత్తిమీర - కొద్దిగా

తయారుచేయు విధానం:
* ముందుగా చిక్ పీస్ లేదా చన్నా (బుడ్డ శెనగలు) గింజలను వేడి
నీళ్లలో 5 గంటలు నానబెట్టాలి.
* తర్వాత స్టౌ మీద లో కుక్కర్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక
అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ ఆనీ, జీలకర్ర,
బిర్యానీ ఆకులు వేసి వేయించాలి.
* తర్వాత మెత్తగా తరిగిన ఉల్లిపాయను వేసి రంగు మారే వరకు
వేయించాలి.
* తర్వాత అందులో టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి,
టొమాటోలో నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు
బాగా వేగించాలి.
* తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి 2-3
నిమిషాలు బాగా కలుపుతూ వేగించుకోవాలి.
*తర్వాత ముందుగా నానబెట్టిన శెనగలను కడిగి బాగా కుక్కర్ లో వేయాలి,
గ్రేవీకి కావల్సినంత నీళ్లు పోసి తిప్పి కుక్కర్‌ను
మూతపెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
* విజిల్ రాగానే కుక్కర్ తెరిచి శెనగల గ్రేవీని స్పూన్‌తో
మొత్తం ఒకసారి కలపాలి. తర్వాత పైన కొత్తిమీర చల్లి తిప్పితే రుచికరమైన
చన్నా మసాలా రెడీ.
Image Courtesy: Kannamma Cooks
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications