కరకరలాడే చెక్కలు.. తయారు చేసుకోవడం చాలా ఈజీ..!

Posted By:

చెక్కలు చేయని తెలుగు ఇళ్లు వుండదంటే ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. ఏ పండగ వచ్చినా చెక్కలు చేయాల్సిందే. కాలక్షేపంలో చెక్కలు తింటూ వుంటే వచ్చే కిక్కు మాటల్లో చెప్పలేము.
చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ ఆర్టికల్‌లో వివరించబోతున్నాము.

చెక్కలను తయారు చేసుకోవడానికి కావాల్సిన వంట సామాగ్రి

1 కప్పు బియ్యం పిండి , 2 టేబుల్ స్పూన్ల బటర్, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, తగినంత ఉప్పు, అర టీస్పూన్ చిల్లీ పౌడర్, కరివేపాకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్లు, నూరిన పచ్చి మిరపకాయ పేస్టు, ఒక టీస్పూన్ జీర.

చెక్కలు తయారు చేసే విధానం

1. ఒక బౌల్‌లో నీరు తీసుకొని దాంట్లో శనగపప్పును వీసి ఒక 30 నిమిశాల వరకు నానబెట్టాలి. వేడి నీళ్లల్లో నానబెడితే శనగపప్పు కొంచం బాగా ఉడికి మంచి టేస్టు వస్తుంది. కాబట్టి వేడి నీళ్లల్లోనే నానబెట్టాలి.

2. ఒక బౌల్‌లో ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. దాంట్లోనే కొన్ని కరివేపాకు ముక్కలను, అల్లం వెల్లుల్లి పేస్టును, కారం, కొంచెం జిలకరను, తగినంత ఉప్పును వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలపాలి.

3. ఇంతకు ముందు నానబెట్టిన శెనగపప్పు లోంచి నీళ్లను మొత్తం తీసివేసి కేవలం అందులో ఆరు టేబుల్ స్పూన్ల నీళ్లను, రెండు టేబుల్ స్పూన్ల బటర్‌ను యాడ్ చేసుకోవాలి. బటర్ మొత్తం శెనగపప్పు ప్యాన్‌లో కరిగిపోతుంది. ఈ లిక్విడ్‌ను మొత్తం బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి.

4. చెక్కలు చేయడానికి వీలు వుండేలా వేడి నీళ్లను పోసుకుంటూ కలుపుకుంటూ వుంటాలి. మరీ పలచగా కాకుండా చూసుకోవాలి.

5. ఇప్పుడు ఖడాయిలో కొంత నూనెను తీసుకొని కాగించాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. కలుపుకున్న బియ్యం పిండిని కావలసినంత చెక్కలను చేయడానికి చిన్న లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ లడ్డూలను అరచేతితో, చేతివేళ్లతో వత్తుతూ చెక్కల షేపు వచ్చేలా చూసుకోవాలి.

6. చెక్కల పిండి చేతికి అతుక్కోకుండా వుండడానికి చేతికి నీళ్లను అంటించుకోవాలి. చెక్కలను సన్నగా వత్తుకోవాలి. అప్పుడు మాత్రమే అవి క్రంచీగా అవుతాయ్.

7. ఇప్పుడు ప్యాన్‌లో చెక్కలను ఫ్రై చేయడానికి వేసిన నూనె కాగిన తరువాత వత్తుకున్న చెక్కలను అందులో వేసి జాగ్రత్తగా విరిగిపోకుండా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టాలి. వాటిని రెండు సర్లు వేంచడం వల్ల ఎక్కువ క్రిస్పీగా మారుతాయ్.

8. చెక్కలను వున్న నూనె కిందకు వెళ్లిపోయాలే, కొంత గాలి తగిలేలా చెక్కలను ఒక పెద్ద బౌల్‌లో తీసుకోవాలి. చల్లారిన తరువాత చెక్కలను ఒక టైట్ మూత వున్న బాక్స్‌లో వేసి పెట్టాలి. దీంతో చెక్కలు రెడీ అయినట్టే.

9. చెక్కలు క్రిస్పీగా రావాలంటే ఫ్రై చేసే ముందు పిండికి బాగా సన్నగా వత్తుకోవాలి. మీడియం ఫ్లేమ్‌పైనే కడాయిని వుంచి ఫ్రై చేయాలి.

దీంతో చెక్కలు తయారు చేసుకోవడం పూర్తయిపోయినట్టే. ఇంట్లో వున్న వంటసామానుతోనే చెక్కలను సులభంగా తయారు చేసుకోగలిగాం. దీని కోసం కావలసిన సమయం 30 నిమిషాలు మాత్రమే. ఖర్చు కూడా చాలా తక్కువే పడుతుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, May 28, 2024, 18:50 [IST]
Desktop Bottom Promotion