Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
చికెన్ సుక్కా..టేస్ట్ లో దీనిని కొట్టిన వంట ఉండదేమో,ఎలా చేయాలంటే
నాన్ వెజ్ లో అనేక రకాలు ఉంటాయి. చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. అలాంటివాటిల్లో చికెన్ సుక్కా ఒకటి. చికెన్ సుక్కా ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలని నాలుక పీకేస్తుంటది. అంత రుచికరంగా ఉంటుంది. చికెన్ సుక్కాను రెస్టారెంట్లలలో తినాలంటే భారీగా ఖర్చుపెట్టాల్సిందే. అయితే దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లోనే చికెన్ సుక్కా తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
చికెన్ సుక్కా తయారీకి కావలసిన పదార్థాలు
చికెన్: 1 కిలో (చిన్న ముక్కలుగా కోసినవి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
కారం: 2 టేబుల్ స్పూన్లు
పసుపు: 1/2 టీస్పూన్
ధనియాల పొడి: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
గరం మసాలా: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా

చికెన్ సుక్కా తయారీ విధానం
-మొదటగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి చేయాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-ఇఫ్పుడు అందులో చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి.
-తర్వాత అందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత మూత తీసి చికెన్ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
-తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి.
కోడిగుడ్డు ఎల్లిపాయ కారం..ఇలాంటి రుచి జన్మలో మరెక్కడా దొరకదు, ఎలా చేయాలంటే
-ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. అంతే చికెన్ సుక్కా రెడీ. చికెన్ ముక్కలు బాగా వేగితే, సుక్కా మరింత రుచిగా ఉంటుంది. రుచి కోసం, కొద్దిగా నిమ్మరసం కలపవచ్చు. అన్నం, చపాతీ, రోటీతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
-నాటుకోడితో చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. కాజు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్,కొబ్బరి తురుము వేసి కూడా చేయవచ్చు. పెరుగు వేసి కూడా చేయవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications