Latest Updates
-
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం.. -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
కొరియన్ల లాగా మెరిసే చర్మం మీ సొంతం కావాలా? అయితే ఈ 5 పండ్లు తినాల్సిందే! -
బరువు తగ్గించి, రక్తాన్ని పెంచే పనస గింజల లడ్డూ.. ఈ స్వీట్ తింటే ఎముకలు దృఢంగా, కంటిచూపు మెరుగ్గా! -
వందల రోగాలను నయం చేసే మునగాకుతో టేస్టీ పూరీ..ఎలా చేసుకోవాలంటే.. -
దోశ, రైస్, చపాతీలోకి కిర్రాక్ అనిపించే చికెన్ చాప్స్..ఈ ఆదివారం స్పెషల్ గా మారిపోతుంది
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక
ఇంట్లో వండుకునే పప్పు, సాంబార్ లేదా రసం లాంటి వంటకాలతో పాటు కరకరలాడే, కొంచెం కారంగా ఉండే సైడ్ డిష్ ఉంటే ఆ భోజనం రుచే మారిపోతుంది. సాధారణంగా నంజుకోడానికి మన ఇళ్లల్లో తరచుగా పకోడీ లేదా అప్పడాలను చేసుకుంటాం. అయితే వీటికి బదులుగా కరకరలాడేలా ఏదైనా తినాలనిపిస్తుందే కుర్ కురే స్టైల్ బెండకాయ ఫ్రై బెస్ట్ ఆప్షన్. బెండకాయ అంటే ఇష్టపడని పిల్లలు సైతం ఈ కరకరలాడే వేపుడు చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. చపాతీ, రోటీల్లోకి కూడా ఇది అద్భుతంగా సెట్ అవుతుంది.
క్రిస్పీ బెండకాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత బెండకాయలు - 500 గ్రాములు
శనగపిండి - 4 టేబుల్ స్పూన్లు
బియ్యప్పిండి - 2 టీస్పూన్లు
కారం పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
నిమ్మరసం - 4 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 1 లేదా 2 టీస్పూన్లు
నూనె - వేయించడానికి

క్రిస్పీ బెండకాయ ఫ్రై తయారీ విధానం
-ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, ఒక పొడి గుడ్డతో తుడిచి తేమ పూర్తిగా పోయేలా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే జిగురుగా మారతాయి.
-తర్వాత బెండకాయ అంచులు కత్తిరించి, నిలువుగా పొడవుగా సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. గింజలు ఇష్టం లేని వారు మధ్యలో తీసేయవచ్చు.
-ఒక పెద్ద గిన్నె తీసుకుని.. అందులో శనగపిండి, బియ్యప్పిండి వేయాలి. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా వేసి ఈ పొడులన్నీ బాగా కలిసేలా మిక్స్ చేయాలి.
-ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి. పిండి అంతా ముక్కలకు పట్టాలి. మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించండి. చివరగా నిమ్మరసం కూడా వేసి మళ్లీ ఒకసారి కలుపుకోవాలి.
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ
-స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయండి. నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, మసాలా పట్టించిన బెండకాయ ముక్కలను వేస్తూ గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు కరకరలాడేలా వేయించుకోవాలి.
-అంతే.. ఎంతో రుచికరమైన, నోరూరించే క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ.
-వేయించిన ఈ ముక్కలు పూర్తిగా చల్లారాక, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు కరకరలాడుతూ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
