Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ బిర్యానీ ముందు చికెన్ బిర్యానీ కూడా దేనికి పనికిరాదు.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
మనలో చాలా మందికి కేవలం చికెన్ బిర్యానీ, మటన్ బిర్యాని లేదా వెజ్ బిర్యాని గురించి మాత్రమే తెలుసు. కానీ గోబీ బిర్యానీకి ఎంత మందికి తెలుసు? ఇది చాలా రుచికరంగా ఉంటుంది. గోబీ ముక్కలు చికెన్ ముక్కల కంటే చాలా రుచికరంగా ఉంటుంది. నోట్లో ఒక్క ముక్క పెట్టుకుంటే లాలాజలం ఊరాల్సిందే. ఆహా ఏమి రుచి అని అనాల్సిందే. కానీ దీనిని చేసుకోవడం చాలా మందికి తెలియదు. అందుకే ఈ స్టోరీలో గోబీ బిర్యాని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము. పూర్తిగా చదివి మీరు కూడా ఈ బిర్యానీని చేసుకోండి.
గోబీ బిర్యాని తయారీకి కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
కాలిఫ్లవర్ (గోబీ) - 1 పెద్దది, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
ఉల్లిపాయలు - 2, సన్నగా తరిగినవి
టమాటాలు - 2, చిన్న ముక్కలుగా తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పెరుగు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 4, చీలికలు చేసుకోవాలి
కొత్తిమీర - 1/4 కప్పు, సన్నగా తరిగినది
పుదీనా - 1/4 కప్పు, సన్నగా తరిగినది
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - వేయించడానికి సరిపడా
మసాలా దినుసులు: బిర్యానీ ఆకు-2, యాలకులు-4, లవంగాలు-4, దాల్చిన
చెక్క-1 చిన్న ముక్క
పొడులు: ధనియాల పొడి-2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా-1 టేబుల్ స్పూన్,
పసుపు- 1/2 టీస్పూన్, కారం-1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం:
బాస్మతి బియ్యాన్ని కడిగి, నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత కాలిఫ్లవర్‌ను చిన్న ముక్కలుగా చేసి, ఉప్పు నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత నీటిని వడగట్టి, కాలిఫ్లవర్‌ను నూనెలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన కాలిఫ్లవర్‌కు పట్టించి, 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో మసాలా దినుసులు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు వేయించాలి.
ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు పోసి, మసాలా దినుసులు, ఉప్పు వేసి మరిగించాలి. నానబెట్టిన బియ్యాన్ని వేసి 80% వరకు ఉడికించాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో సగం ఉడికించిన బియ్యాన్ని వేయాలి. దానిపై వేయించిన కాలిఫ్లవర్ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేయాలి. మిగిలిన బియ్యాన్ని కూడా వేసి సమానంగా పరచాలి. పైన నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు వేసి మూత పెట్టాలి. గిన్నెను వేడి తవ్వపై పెట్టి 15-20 నిమిషాల పాటు చిన్న మంటపై దమ్ చేయాలి. అనంతరం గోబీ దమ్ బిర్యానిని వేడివేడిగా రైతా లేదా ఏదైనా కూరతో సర్వ్ చేసుకోవడం అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications