అద్భుతమైన రుచి 'గ్రీన్' ఫిష్ ఫ్రై: పచ్చిచింతకాయతో చేపల వేపుడు మెగాస్టార్ కు ఇష్టమైన డిష్

Posted By:

కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా జన్మించిన చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన నటులలో ఒకరిగా బాగా పాపులర్ అయ్యారు. అతను భారత ప్రభుత్వం నుండి 2006లో పద్మభూషణ్ మరియు 2024లో పద్మవిభూషణ్‌తో సహా అనేక గౌరవ ప్రదమైన అవార్డులను అందుకున్నాడు. ప్రఖ్యాత భారతీయ నటుడు, రాజకీయవేత్త మరియు తెలుగు సూపర్ స్టార్ చిరంజీవికి చాలా సాధారణమైన ఇంకా రుచికరమైన ఇంటి ఆహారం అంటే ఎక్కువగా ఇష్టపడుతారు. అతనికి అమ్మచేసిన వంటలంటే చాలా ఇష్టమట. తనకు ఇష్టమైన వంటల్లో చేపలు ముందువరసలో ఉంటాయి. తను ఇష్టంగా తినే చేపల వేపుడును చిన్న నాటి జ్ఝాపకాలను గుర్తు చేసుకుంటూ తన అమ్మ కోసం ఒక రిసిపిని తయారుచేయు విధానంను తన సోషియల్ మీడియా ద్వారా పంచుకున్నారు .

చింతపండుతో వేయించిన స్పెషల్ చేపల వేపుడు ఈ వంటను తయారుచేయడమే కాదు తన తల్లికి తినిపించి ఆశ్చర్యపరిచారు. చిరు పంచుకున్న వీడియోలో, అతను తన తల్లికి ఈ వంటకం నచ్చిందో లేదో తెలుసుకోవడానికి చాలా ఆత్రుతగా వేచి ఉండటం చూడవచ్చు. తన తల్లి అంజనాదేవికి ఇష్టమైన రిసిపిని అనుసరించి ఫిష్ ఫ్రైని సిద్ధం చేశానని చెప్పారు.

Make Green Fish Fry Tamarrind Fish Fry Recipe

చిరంజీవి తల్లికి ఫిష్ ఫ్రై మరియు అతని తీపి సంజ్ఞ కూడా బాగా నచ్చింది. ఆమె చేపల వేపుడు రుచి చూసి 'చాలా బాగుంది.' ఆమె తన చేతులతో తన ప్రియమైన కొడుకుకు వేయించిన చేపలతో అన్నం తినిపించింది. ఇంతలో, చిరంజీవి అభిమానులు ఈ అద్భుతమైన వీడియోను ఆస్వాదించారు మరియు ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. చాలా తక్కువ పదార్థాలు అవసరమయ్యే ఈ టేస్టీ ఫిష్ ఫ్రై కోసం రెసిపీని చూడండి.

కావలసినపదార్థాలు
ఫిష్ ఫిల్లెట్స్ : 5-10
పచ్చి చింతకాయలు: 4-5
కారం పొడి: 1tsp
పసుపు పొడి: 1/4 tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర : చిటికెడు (అవసరం అయితే)
ఉల్లిపాయ : 1
పచ్చి మిర్చి: 1
2 స్పూన్ కొబ్బరి నూనె

Make Green Fish Fry Tamarrind Fish Fry Recipe

తయారు చేయు విధానం

  • ముందుగా చేపలను బాగా శుభ్రంగా కడిగి నీరు మొత్తం వంపేసి, తడి ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి.
  • తర్వాత పచ్చి చింతకాయలను కచపచ తొక్కును దంచి పెట్టుకోవాలి
  • అలాగే ఉల్లిపాయ,పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా చేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో చేపలను వేసి, వాటి మీద చింతకాయల తొక్కు, ఉల్లిపాయ పచ్చిమిర్చి తొక్కు, ఉప్పు, కారం, పసుపు, అన్నీ వేసి
  • మొత్తం మిశ్రంను బాగా కలపాలి. చేపలకు బాగా పట్టే విధంగా మ్యారినేట్ చేయాలి.
  • మసాలాతో ఫిష్ ఫిల్లెట్లను మెరినేట్ చేసి 10 నిముషాలు పక్కన పెట్టాలి
  • తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక అందులో మ్యారినేట్ చేసిన చేపలను ఒక్కొక్కొటిగా అమర్చుకోవాలి.
  • తర్వాత మీడియం మంట మీద ఉడికించాలి.5 నిముషాల తర్వాత చేపలను రెండో వైపు కూడా తిప్పి, మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
  • చేపల రెండు వైపులా ఉడికినంత వరకు వేడి నూనెలో వేయించాలి. మరీ డ్రైగా అనిపిస్తే ఆయిల్ స్ప్రే చేయొచ్చు. అంతే చింతపండు చేపల వేపుడు రెడీ.
[ of 5 - Users]
Desktop Bottom Promotion