గుజరాత్ స్పెషల్ వంట మేతీ థెప్లాస్, చపాతీల కంటే వందరెట్లు బెటర్, ఎలా చేసుకోవాలంటే?

గోధుమ పిండితో ఎప్పుడూ చపాతీలే తింటుంటారు. చాలా మంది వాటినే తినడానికి ఇష్ట పడుతుంటారు. కానీ మీరెప్పుడైనా గోధుమ పిండితో చేసే మేతీ థెప్లాస్ తిన్నారా?. ఇది గుజరాతీల చాలా స్పెషల్ వంటకం. దీనిని గుజరాత్‌లో ఎక్కువగా చేసుకొని తింటుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కానీ చాలా మందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఈ మేతీ థెప్లాస్ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మేతీ థెప్లాస్ తయారీకి కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి - 2 కప్పులు
మెంతి ఆకులు - 1 కప్పు (సన్నగా తరిగినవి)
పెరుగు - 1/4 కప్పు
శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
అల్లం - 1 టీస్పూన్ (తురిమినది)
పచ్చిమిర్చి - 1 టీస్పూన్ (సన్నగా తరిగినవి)
పసుపు - 1/2 టీస్పూన్
కారం - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు (పిండి కలపడానికి), కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, శనగపిండి, మెంతి ఆకులు, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
  2. తర్వాత పెరుగు, నూనె వేసి బాగా కలపాలి.
  3. కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ మెత్తని పిండిలా కలుపుకోవాలి.
  4. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి, ఒక్కొక్క ఉండను చపాతీలా ఒత్తుకోవాలి.
  5. పెనం వేడి చేసి, ఒత్తుకున్న థెప్లాను వేసి రెండు వైపులా నూనె వేస్తూ బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. అంతే మేతీ థెప్లాస్ సిద్ధమైనట్లే.
  6. వేడి వేడి థెప్లాస్‌ను పెరుగు లేదా ఊరగాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
[ of 5 - Users]
Story first published: Sunday, February 23, 2025, 15:22 [IST]
Desktop Bottom Promotion