Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మన పూర్వీకులు తిన్నది ఇదే..వేసవిలో ఒంటికి చలువ,జీర్ణక్రియకు దివ్యౌషధం..ఎలా చేయాలంటే
మనం ఇఫ్పటికీ మన పూర్వీకుల ఆరోగ్యం గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. బీపీలు, షుగర్ లు వంటి ఏ రోగాలు లేకుండా హాయిగా మన పూర్వీకులు జీవించడానికి ప్రధాన కారణం వారు తీసుకున్న ఆహారం. గట్టి ఆహారం తీసుకున్నారు కాబట్టే ముసలివయస్సులో ఎంతో యాక్టివ్ గా ఉంటేవాళ్లు. మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన వంటకాల్లో మెంతికూర గట్టి పప్పు ఒకటి. ఇది పోషకాల గని అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
సాధారణ పప్పు కంటే ఇది కొంచెం గట్టిగా ఉండటం వల్ల దీనికి గట్టి పప్పు అని పేరు వచ్చింది. ఇది అన్నం, చపాతీ లేదా రోటీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన,ఆరోగ్యకరమైన మెంతికూర పప్పు తయారుచేయడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

మెంతికూర గట్టి పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
-కంది పప్పు - 1 కప్పు
-మెంతికూర - 1 పెద్ద కట్ట
-ఉల్లిపాయ - 1 మీడియం సైజు
-టమాటో - 1 మీడియం సైజు
-పచ్చిమిర్చి - 2-3
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
-పసుపు - 1/2 టీస్పూన్
-కారం - 1/2 టీస్పూన్
-ధనియాల పొడి - 1/2 టీస్పూన్
-జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
-ఆవాలు - 1/2 టీస్పూన్
-జీలకర్ర - 1/2 టీస్పూన్
-ఎండుమిర్చి - 2
-కరివేపాకు - 1 రెమ్మ
-నూనె - 2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - తగినంత
-నిమ్మరసం - కొద్దిగా
ఎగ్ బటర్ మసాలా..తిన్నారంటే మస్త్ మజా,ఎలా చేయాలంటే..
మెంతికూర గట్టిపప్పు తయారీ విధానం
-ముందుగా కంది పప్పును శుభ్రంగా కడిగి కనీసం 30 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది, రుచిగా ఉంటుంది.
-తర్వాత నానబెట్టిన పప్పును కుక్కర్ లో వేసి తగినంత నీరు, కొద్దిగా పసుపు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు మెత్తగా ఉడకాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు తరిగిన టమాటో ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించండి. తర్వాత తరిగిన మెంతికూర వేసి అది మగ్గే వరకు ఉడికించాలి. మెంతికూర బాగా మగ్గితే దాని చేదు రుచి తగ్గుతుంది.
-ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసి..మగ్గిన మెంతికూర మిశ్రమంలో వేయండి. కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి,రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి పప్పు గట్టిదనాన్ని సర్దుబాటు చేసుకోండి.
-పప్పును మూత పెట్టి 5-7 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించండి. ఇలా చేయడం వల్ల అన్ని రుచులు బాగా కలిసిపోతాయి.
-ఇప్పుడు ఒక చిన్న బాండీలో నూనె లేదా నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయండి. అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఈ తాలింపును మెంతికూర పప్పులో వేసి కలపండి.
-స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా నిమ్మరసం పిండితే మరింత రుచిగా ఉంటుంది.అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మెంతికూర గట్టి పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
