Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Kaju gravy: కాజు గ్రేవీని రెస్టారెంట్ స్టైల్ లో..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
జీడిపప్పు అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్. జీడిపప్పుతో కూర చేస్తే దాని టేస్ట్ కి మించినది మరోటి ఉండదు. కాజు గ్రేవీ లేదా జీడిపప్పు గ్రేవీనీ(cashew gravy) రోటీ, నాన్, చపాతీలతో తింటుంటే ఎన్ని అయినా అలా నోట్లోకి పోతూనే ఉంటాయి. నోటికి స్వర్గంలా అనిపిస్తుంది. అయితే మీరు ఇంట్లోనే హోటల్ స్టైల్ లాంటి జీడిపప్పు గ్రేవీని సులభంగా తయారు చేసుకోవచ్చు. కాజు గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు, కాజు గ్రేవీ తయారీ విధానం ఇక్కడ చూడండి.
కాజు గ్రేవీ తయారీకి కావలసిన పదార్థాలు
-నూనె - 3-4 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర - 1/2 టీస్పూన్
-దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
-లవంగం - 2-3
-బే ఆకులు - 1
-కొత్తిమీర - కొంచెం
-జీడిపప్పు - 1 కప్పు (రాత్రిపూట నానబెట్టినవి)
-టొమాటోలు - 2 (సన్నగా కట్ చేసిన)
-ఉల్లిపాయ - 1 పెద్దది (సన్నగా తరిగినవి)
-అల్లం - 1 అంగుళం (తురిమినవి)
-పచ్చిమిర్చి - 2(సన్నగా తరిగినవి)
-ధనియాల పొడి - 1 టీస్పూన్
-ఎర్ర కారం - 1/2 టీస్పూన్
-వెల్లుల్లి - 4-5 రెబ్బలు(సన్నగా తరిగినవి)
-పసుపు - 1/2 టీస్పూన్
-గరం మసాలా - 1/4 టీస్పూన్
-ఉప్పు - రుచికి తగినంత

కాజు గ్రేవీ తయారీ విధానం
-ముందుగా నానబెట్టిన జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్
చేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేసి అందులో జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, బే ఆకులను వేసి చిటపటలాడనివ్వండి.
- ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటోలు,తురిమిన అల్లం,సన్నగా తరిగిన వెల్లుల్లి,సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో పసుపు పొడి, ధనియాల పొడి, ఎర్ర కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.
తర్వాత అందులో ముందుగా చేసి పక్కనపెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి.
-తర్వాత కొద్దిగా నీళ్లు యాడ్ చేసి మందపాటి గ్రేవీని తయారు చేయండి.
-తక్కువ మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి.
-పచ్చి కొత్తిమీరతో కొంచెం చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి కాజు కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
