Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
కనుమ చేపల పులుసు.. ఒక్కసారి రుచి చూస్తే జీవితంలో మర్చిపోరు.. సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
సంక్రాంతిలో మూడో రోజైన కనుమ నాడు మాంసాహారంతో ఇంటికి వచ్చిన అతిథులకు విందు ఇస్తారు. ఈ విందులో నాన్ వెజ్ వంటలు అధికంగా చేస్తుంటారు. వాటిలో ముఖ్యమైనది నాటుకోడి పులుసు, చేపల పులుసు. సాధారణ రోజుల్లో చేపల పులుసుకు, కనుమ రోజున చేసే చేపల పులుసును చాలా తేడా ఉంటుంది. కనుమ రోజున చేసే చేపల పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. ఆ రుచి ఎలా వస్తుందో తెలియదు కానీ, ఓసారి తింటే ఆ కమ్మదనంలో మైమరచిపోతాము అంతే. ఇంతకీ కనుమ స్పెషల్ చేపల పులుసు ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు (మీ ఇష్టమైన చేప)
ఉల్లిపాయ - 2
తోటకూర - కొద్దిగా
చింతపండు రసం
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి - 5 రేబలు
పసుపు - 1/2 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
కారం పొడి - రుచికి తగినంత
కొత్తిమీర తాలూకు - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొబ్బరి తురుము - 1/4 కప్
నిమ్మరసం - 1 నిమ్మకాయ
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత
కసూరి మేతి - కొద్దిగా (ఐచ్ఛికం)
తయారీ విధానం:
చేపలను శుభ్రం చేసి, ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత చేపలకు పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి వాటిని ముద్దగా చేసుకొని చేపలకు బాగా పట్టే విధంగా బాగా రుద్దుకోండి.
ఇప్పుడు ఒక పాత్రలో నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేసుకోవాలి. అలాగే అందులోని కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని.. ఉల్లిపాయ ముక్కలు బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఆ తరువాత ఆ మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ఓసారి చేపను కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఆ తరువాత అందులో చింతపండు రసం పోసుకోవాలి. అలాగే గరం మసాలా, మిరియాల పొడి, కారం పొడి వేసుకొని గరిటె పెట్టి కలపకుండా గిన్నెను తిప్పుతూ కలుపుకొని పొయ్యి సన్నటి మంట మీద ఉడికించుకోవాలి.
ముక్కలు బాగా ఉడికినట్లు నిర్ధారించుకున్న తరువాత అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని, నిమ్మకాయ కూడా పిండుకొని ఓసారి మళ్ళీ కలుపుకొని దించుకుంటే ఎంతో రుచికమైన కనుమ చేపల పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications