Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
పచ్చి కొబ్బరితో కారం పొడి..ఇలా చేశారంటే అన్నం,టిఫిన్స్ లోకి అదరహో అంతే
పచ్చి కొబ్బరి కారం దక్షిణ భారతదేశంలో చాలా పాపులర్. ఈ కారం అన్నం, ఇడ్లీ, దోశ, ఇతర టిఫిన్స్ లో సైడ్ డిష్ లేదా చట్నీగా ఉపయోగించబడుతుంది. దీని తయారీ కూడా చాలా ఈజీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం దాని సొంత ప్రత్యేకమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. దీని రుచి ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది. మీ ఇంట్లోనే ఈజీగా పచ్చి కొబ్బరితో కారం పొడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
పచ్చి కొబ్బరి కారం తయారీకి కావలసిన పదార్థాలు
-జీలకర్ర - 1/2 టీ స్పూన్
-మినపప్పు - 1 టేబుల్ స్పూన్
-వెల్లుల్లి రెబ్బలు - 4-5
-కరివేపాకు - 1 రెబ్బ
-ఎండు మిరపకాయలు - 8-10
-పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
-శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
-ధనియాలు - 1 టీ స్పూన్
-చింతపండు - చిన్న ముక్క
-ఉప్పు - రుచికి తగినంత
-నూనె - 2 టేబుల్ స్పూన్లు

కొబ్బరి కారం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి అవి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ధనియాలు,జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి.
-ఇప్పుడు అందులో ఎండు మిరపకాయలు వేసి అవి కొద్దిగా కారం వాసన వచ్చే వరకు వేయించాలి. మీరు మీ రుచికి తగినట్లుగా ఎండు మిరపకాయల సంఖ్యను పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.
-తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక మంచి సువాసన వస్తుంది.
-చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి అది వేడి అయ్యే వరకు వేయించాలి. ఎక్కువ వేయిస్తే కొబ్బరిలోని తేమ తగ్గి కారం పొడిలా తయారవుతుంది. కాబట్టి కొద్దిగా వేడి చేస్తే సరిపోతుంది.
వంకాయ పల్లికారం..ఇలా చేశారంటే మీ ఆయన మీ చుట్టూ తిరగాల్సిందే,పిల్లలకు కూడా నచ్చుతుంది
-స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేయాలి. ఇందులోనే చింతపండు, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు కూడా కలుపుకోవచ్చు కానీ సాధారణంగా పచ్చి కొబ్బరిలో ఉండే తేమ సరిపోతుంది.
-గ్రైండ్ చేసిన కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ కారాన్ని నిల్వ చేసుకోవడానికి ఒక గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
