Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కొర్రమీను చేపల పచ్చడి.. ఒక్క ముక్క తింటే స్వర్గమే, సింపుల్‌గా ఎలా చేసుకోవాలంటే?
చేపలు అంటే చాలా మందికి ప్రాణం. చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగడంతో పాటు.. ఆ చేపల కూర చాలా రుచికరంగా ఉంటుంది. చేపలతో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. అవన్నీ చాలా రుచికరంగా ఉన్నాయి. వాటిలో కొర్రమీను చేపల కూరలు చాలా రుచికరంగా ఉంటాయి. ఈ కొర్రమీను చేపలతో పచ్చడి పెట్టుకుంటే అవి చాలా రోజులు రావడంతో పాటు.. చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ దానిని ఎలా చేసుకోవాలో ఎవరికీ తెలియదు. అందుకే ఈ స్టోరీలో కొర్రమీను చేపల పచ్చడి ఎలా పెట్టుకోవాలో వివరించాము. చదివి మీరు కూడా ట్రై చేసి చూడండి.
కొర్రమీను చేపల పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
కొర్రమీను చేప ముక్కలు - 1 కేజీ
పల్లీ నూనె - సుమారు ½ లీటర్
పసుపు - ½ టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కారం పొడి - 1 కప్పు (తక్కువ మసాలా ఇష్టమైతే తగ్గించవచ్చు)
తాజా అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 5 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - ½ కప్పు
కరివేపాకు - కొన్ని రెమ్మలు

మసాలా పొడి తయారీకి:
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
మెంతులు - ½ టీస్పూన్
ఆవాలు - ½ టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
లవంగాలు, యాలకులు - తలపాగలన్ని (దాదాపు 6-8)
దాల్చిన చెక్క - చిన్న ముక్క
తమలపాకు కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? దీని ముందు మిగతా చట్నీలన్నీ వేస్ట్..ఎలా చేసుకోవాలంటే
కొర్రమీను చేపల పచ్చడి తయారీ విధానం:
1. చేప ముక్కల ప్రిపరేషన్
ముందుగా కొర్రమీను చేప ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కునేటప్పడు ముక్కలపై కాస్త నిమ్మరసం, ఉప్పు వేసి నీటిలో వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు బాగా నీటిగా క్లీన్ అవుతాయి. కడిగిన తరువాత అందులోని నీరు పూర్తిగా కారిన తర్వాత వాటిని శుభ్రమైన బట్టపై పరచి, పైన ఫ్యాన్ వేసి తడిగా ఉండకుండా ఎండబెట్టాలి.
2. మసాలా పొడి తయారీ
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసి అన్ని మసాలాలు తళతళలాడేవరకు వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసుకోవాలి. దీంతో పచ్చడిలో వేసుకునే మన మసాలా రెడీ అయిపోయినట్లే.
3. చేప ముక్కలు ఫ్రై చేయడం
ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి, పసుపు & ఉప్పు కలిపిన చేప ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేయాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టాలి.
4. పచ్చడి పేస్ తయారీ
ఇప్పుడు అదే నూనెలో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేవరకు వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అనంతరం అందులో ఫ్రై చేసిన చేప ముక్కలు, కారం పొడి, ఉప్పు, మరియు తయారైన మసాలా పొడి వేసి బాగా కలపాలి.
5. ఫైనల్ టచ్
చివరగా స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం కలిపి, మళ్ళీ మెత్తగా కలిపితే... పచ్చడి రెడీ! ఈ చేపల పచ్చడిని గాజు జార్‌లో లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో నిల్వ ఉంచితే 2 నెలల వరకూ తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications