Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
కొత్తిమీర అప్పడాలు..ఇలా పెట్టుకుంటే ఏడాదంతా పప్పుచారు,సాంబార్ తో రుచిగా తినేయొచ్చు
భారతీయ వంటకాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వడియాలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. పప్పు, సాంబార్, పులుసు, లేదా రసం వంటి వాటితో పాటు వీటిని ఆస్వాదించడం ఒక సంప్రదాయం. వడియాలు వివిధ రకాల కూరగాయలు, పిండి పదార్థాలు, మసాలాలతో తయారు చేయబడతాయి. అటువంటి వాటిలో కొత్తిమీర వడియాలు ఒక ప్రత్యేకమైన రుచిని, సువాసనను కలిగి ఉంటాయి. కొత్తిమీర తాజాదనం, సువాసనతో నిండిన ఈ వడియాలు రుచికరంగా ఉండటమే కాకుండా,కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. కొత్తిమీర వడియాలను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మినప పప్పు: 1 కప్పు
కొత్తిమీర కట్టలు: 2 పెద్దవి
పచ్చిమిర్చి: 5-7
అల్లం: 1 అంగుళం ముక్క
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: తగినంత
ఇంగువ: 1/2 టీ స్పూన్
నూనె: వడియాలు వేయించడానికి సరిపడా

తయారీ విధానం
-ముందుగా పొట్టు లేని మినపప్పును శుభ్రంగా కడిగి కనీసం 4-6 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టండి.
-తర్వాత కొత్తిమీర కట్టలను తీసుకోండి. ఆకులు, లేత కాడలను వేరు చేసి
కొత్తిమీరను 2-3 సార్లు నీటితో బాగా కడగాలి
.
-కడిగిన కొత్తిమీరను నీరు లేకుండా పూర్తిగా ఆరనివ్వండి. తర్వాత సన్నగా
తరిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు నానబెట్టిన మినప పప్పు నుండి నీటిని పూర్తిగా తీసిసి దానిని మిక్సీ గిన్నెలో వేసి ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేయండి. యఅవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమేవేసి మెత్తగా, గట్టి పేస్ట్‌లా గ్రైండ్ చేయండి. పిండి చాలా పలచగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి.
-గ్రైండ్ చేసిన మినప పప్పు పేస్ట్ ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు,ఇంగువ వేసి బాగా కలపండి. పిండిని సుమారు 5-7 నిమిషాలు చేత్తో బాగా కలిపి, గాలి తగిలేలా చేయండి.
-తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ లేదా వడియాలు పెట్టడానికి ఉపయోగించే ప్రత్యేకమైన వస్త్రం తీసుకోండి. దీనిని శుభ్రమైన ప్రదేశంలో నేరుగా ఎండ తగిలే చోట పరచండి.
నో మిల్క్, నో షుగర్..ఎక్కువ రోజులు నిల్వ ఉండే సూపర్ టేస్టీ రవ్వ లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే
-మీ చేతులను కొద్దిగా తడిపి లేదా నూనె రాసుకొని తయారుచేసిన పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న వడియాలుగా మీకు నచ్చిన పరిమాణంలో షీట్‌పై దూరదూరంగా పెట్టండి.
-వడియాలను 3-4 రోజులు లేదా అవి పూర్తిగా ఎండిపోయి, గట్టిగా మారే వరకు ఎండలో ఎండబెట్టండి. ప్రతిరోజు సాయంత్రం వాటిని ఎండ నుండి తీసి రాత్రి పూట లోపల భద్రపరచండి. మరుసటి రోజు మళ్లీ ఎండలో పెట్టండి. పూర్తిగా ఎండిన తర్వాత,వడియాలు తేలికగా, రాయిలా గట్టిగా మారతాయి.
-పూర్తిగా ఎండిన వడియాలను ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇవి సుమారు 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు తాజాగా ఉంటాయి.
వ-డియాలు వేయించడానికి, ఒక బాండీలో ఆయిల్ వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక అందులో కొన్ని వడియాలను వేసి అవి బంగారు గోధుమ రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించి తీయండి.
-వేడి వేడి అన్నంతో పాటు పప్పు, సాంబార్, రసం లేదా పులుసుతో వడియాలను తింటుంటే అదుర్స్ అంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
