Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నోరూరించే మధురై మటన్ పొడిమాస్.. ఇలా చేస్తే వదలకుండా తింటారు!
వీకెండ్ వచ్చిందంటే చాలు, మాంసాహార ప్రియుల ఇళ్లలో ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఘుమఘుమలాడాల్సిందే. రెగ్యులర్ గా చేసుకునే మటన్ కర్రీ, మటన్ ఫ్రై బోర్ కొట్టేసి కొత్తగా, వినూత్నంగా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే తమిళనాడు సంప్రదాయ రుచుల్లో ఒకటైన మధురై స్పెషల్ మటన్ పొడిమాస్ ప్రయత్నించండి. సాధారణంగా మటన్ ముక్కలు నమలడానికి పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ పొడిమాస్ ను ఖైమా తరహాలో చేయడం వల్ల ఎవరైనా ఇట్టే, తేలికగా తినేయవచ్చు. పైగా ఇది సులభంగా జీర్ణమవుతుంది.

మటన్ పొడిమాస్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ మటన్ (ఎముకలు లేనిది) - 400 గ్రాములు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
స్వచ్ఛమైన నెయ్యి - 1 టీస్పూన్
దంచిన వెల్లుల్లి రెబ్బలు - 2
తురిమిన అల్లం - పావు అంగుళం ముక్క
నీళ్లు - తగినన్ని
నూనె - 2 టీస్పూన్లు
నెయ్యి - 1 టీస్పూన్
ఆవాలు - పావు టీస్పూన్
మినపపప్పు - ముప్పావు టీస్పూన్
జీలకర్ర, సోంపు - రెండు చిటికెల చొప్పున
మిరియాల పొడి - అర టీస్పూన్
జీడిపప్పు - 10
సన్నగా తరిగిన అల్లం - అర అంగుళం
సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు - 6
పచ్చిమిర్చి - 4 (సన్నని తరుగు)
చిన్న ఉల్లిపాయలు (సాంబార్ ఉల్లిపాయలు) - రెండు గుప్పెళ్లు
(తరిగినవి)
కారం - 1/4 టీస్పూన్
పసుపు - ఒక చిటికెడు
పచ్చి కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా
మటన్ పొడిమాస్ తయారీ విధానం
-ముందుగా బోన్ లెస్ మటన్ ను శుభ్రంగా కడిగి, నీళ్లు లేకుండా పిండేసి మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా (ఖైమాలా) రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్రెషర్ కుక్కర్‌లో వేసి అందులో పసుపు, కొద్దిగా ఉప్పు, దంచిన అల్లం వెల్లుల్లి, ఒక చెంచా నెయ్యి వేసి బాగా కలపాలి. మటన్ ఉడకడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టి, 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో ఆవాలు, మినపపప్పు, జీలకర్ర, సోంపు, మిరియాల పొడి, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయల ముక్కలు వేసి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, కారం వేసి ఉల్లిపాయలు మెత్తబడేవరకు మగ్గనివ్వాలి.
-తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని నీటితో సహా ఇందులో వేసి బాగా కలపాలి. మూతపెట్టి ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి. మటన్ దగ్గరపడిన తర్వాత, చివరగా పచ్చి కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు గరిటెతో కలుపుతూ వేయించాలి.
-చివరగా కరివేపాకు, కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే.. నోరూరించే మధురై మటన్ పొడిమాస్ రెడ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications