Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
నార్త్ ఇండియా స్పెషల్ 'మలై కోఫ్తా'..చపాతీ,రైస్ లోకి అదిరిపోద్ది..ఎలా చేసుకోవాలో చూడండి
తినడానికి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునేవారికి మలై కోఫ్తా ఓ సారి ట్రై చేసి చూడండి. మలై కోఫ్తా అనేది ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన వంటకం. ఇది చాలా రుచికరమైనది, క్రీమీగా ఉంటుంది. ఇది ఎక్కువగా రెస్టారెంట్‌లో దొరుకుతుంది..అయితే దీన్ని మీరు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోవచ్చు. మలై కోఫ్తా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
మలై కోఫ్తా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
పన్నీర్ - 200 గ్రాములు (తురిమినది)
ఉడికించిన బంగాళాదుంపలు - 2
పసుపు - 1/2 టీ స్పూన్
కారం - 1 టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
గరం మసాలా - 1/2 టీ స్పూన్
కసూరి మేథి - 1 టీ స్పూన్
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 10
కిస్మిస్ - 10
ఉప్పు - సరిపడా
నూనె - సరిపడా
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 3 (గుజ్జుగా చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
క్రీమ్ - 1/2 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా

మలై కోఫ్తా కూర తయారీ విధానం
-ముందుగా కోఫ్తా ఒక గిన్నెలో పన్నీర్ తరుము, ఉడికించి మాష్ చేసిన బంగాళాదుంపలు, మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకుని మధ్యలో జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు పెట్టి మూసివేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి తయారుచేసుకున్న కోఫ్తాలను బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మరో బాండీ పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాక టమోటా గుజ్జు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
కూరగాయలే అవసరం లేని రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు..నాకి నాకి తింటారు, ఎలా చేసుకోవాలో చూడండి
-తర్వాత జీడిపప్పు పేస్ట్, క్రీమ్, గరం మసాలా, కసూరి మేథి, ఉప్పు వేసి బాగా కలపాలి.
-కొద్దిగా నీరు పోసి గ్రేవీని మరిగించాలి.
-వేయించిన కోఫ్తాలను గ్రేవీలో వేసి 5 నిమిషాలు ఉడికించాలి.అంతే మలై కోఫ్తా రెడీ.
-వేడివేడిగా మలై కోఫ్తా కూరను చపాతీ, నాన్ లేదా అన్నంతో తింటే అదిరిపోతుందంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
