Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
మన పూర్వీకులు తిన్న వడలు ఇవే..బాహుబలి శక్తి..ఎలా చేసుకోవాలంటే
దక్షిణ భారతదేశంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్ లోకి వడలను ఎక్కువగా తింటుంటారు. అయితే వడలను చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మినపప్పు నానబెట్టి దాన్ని రుబ్బుకోవాలి,ఆ తర్వాత వడలు వేసుకోవాలి. అయితే ఇదంతా అవసరం లేకుండా మరమరాలు ఉంటే 10 నిమిషాల్లోనే క్రిస్పీ వడలు చేసుకోవచ్చు. మరమరాలతో చేసే వడల టేస్ట్ మినప వడలను మించి ఉంటుంది. మరమరాల వడ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
మరమరాల వడ తయారీకి కావీల్సిన పదార్థాలు
-మరమరాలు
-కొత్తిమీర
-కరివేపాకు
-అల్లం
-ఉప్పు
-జీలకర్ర
-పెరుగు
-బియ్యం పిండి
-ఆయిల్
మరమరాల వడ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో మూడు కప్పుల మరమరాలు పోయండి. అందులోనే కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టండి.
-తర్వాత నీళ్లు మొత్తం పారబోసి మరమరాలను కొంచెం లైట్ గా మాష్ చేసుకోవాలి.
-అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. తడి సరిపోకుంటే కొంచెం పెరుగు లేదా నీళ్లు యాడ్ చేసుకోండి.
-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని కలిపిన పిండిని కొంచెం చేతుల్లోకి తీసుకొని వడల షేపులో వత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ ని వేడి చేసిన తర్వాత అందులో వీటిని వేయండి. బాగా కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసేస్తే చాలు. అంతే టేస్టీ మరమరాల వడలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









